MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiruf475f73f-961a-4ff2-ab28-85208dfb01d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiruf475f73f-961a-4ff2-ab28-85208dfb01d4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాల విడుదల విషయంలో మెగా ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అనే వివరాలను తెలుసుChiru{#}Makar Sakranti;Chicken;GEUM;Pawan Kalyan;January;Trisha Krishnan;Chiranjeevi;News;Telugu;December;shankar;Cinemaటెన్షన్లో మెగా ఫ్యాన్స్.. రెండు సినిమాలపై అనుమానాలే..?టెన్షన్లో మెగా ఫ్యాన్స్.. రెండు సినిమాలపై అనుమానాలే..?Chiru{#}Makar Sakranti;Chicken;GEUM;Pawan Kalyan;January;Trisha Krishnan;Chiranjeevi;News;Telugu;December;shankar;CinemaFri, 04 Oct 2024 12:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాల విడుదల విషయంలో మెగా ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీకి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవి కి చికెన్ గున్యా వచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా షూటింగ్ పెండింగ్లో పడిపోయినట్లు , ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావడం కష్టం అని ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇక చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల కావడం కష్టం అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా విడుదల తేదీలు దగ్గర పడిన సమయంలో ఈ రెండు మూవీలు చెప్పిన తేదీకి విడుదల కావు అనే వార్తలు వైరల్ అవుతూ ఉండగా మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>