MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-vijay-this-is-the-story-that-no-one-expected-in-tollywoodd354906f-7424-4999-bc02-8d0feb73c8d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-vijay-this-is-the-story-that-no-one-expected-in-tollywoodd354906f-7424-4999-bc02-8d0feb73c8d2-415x250-IndiaHerald.jpgఅలా మన టాలీవుడ్ లో పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ... ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో రౌడీ హీరోగా టాలీవుడ్ లోనే తిరిగిలేని స్టార్డం అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నుంచి వెనుక తిరిగి చూసుకోకుండా వరుస‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా విజయ్ తన క్రేజ్‌ను పెంచుకున్నాడు. Mahesh and Vijay {#}Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Pokiri;Joseph Vijay;vijay deverakonda;mahesh babu;kushi;Kushi;Success;Nijam;Rajani kanth;India;Tollywood;Hero;Cinemaమహేష్ తో విజయ్.. టాలీవుడ్ లోనే ఎవరు ఊహించని స్టోరీ ఇదే..మహేష్ తో విజయ్.. టాలీవుడ్ లోనే ఎవరు ఊహించని స్టోరీ ఇదే..Mahesh and Vijay {#}Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Pokiri;Joseph Vijay;vijay deverakonda;mahesh babu;kushi;Kushi;Success;Nijam;Rajani kanth;India;Tollywood;Hero;CinemaFri, 04 Oct 2024 16:22:51 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో కొత్త తరం హీరోలు వస్తున్నారు. వారిలో కొంతమంది మాత్రమే అగ్ర హీరోలుగా రాణిస్తున్నారు. అలా మన టాలీవుడ్ లో పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ... ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో రౌడీ హీరోగా టాలీవుడ్ లోనే తిరిగిలేని స్టార్డం అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నుంచి వెనుక తిరిగి చూసుకోకుండా వరుస‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా విజయ్ తన క్రేజ్‌ను పెంచుకున్నాడు.

ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ నటించిన గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన సక్సెస్ అందుకోలేక పోయాయి. పాన్ ఇండియా మూవీ గా వచ్చిన లైగ‌ర్ విజయ్‌కు భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి విజయ్ క్రేజ్ కు సరిపడ హిట్ సినిమాగా ప‌డ‌లేదు. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పరుశురాంతో చేసిన ఫ్యామిలీ స్టార్ కూడా విజయ్‌కు సక్సెస్ ఇవ్వలేదు.ఇక ప్ర‌స్తుతం విజయ్ తన 12వ‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ తన వ్యక్తిగత జీవితంపై చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ హీరోగా మారటానికి సూపర్ స్టార్ మహేష్ బాబే కారణమట. ఎస్ మీరు వింటున్నది నిజమే.. ఇదే విషయాన్ని విజయ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అలా అని విజయ్ హీరోగా ఎదగడానికి మహేష్ సాయం చేశాడు అనుకుంటే పొరపాటే అవుతుంది. నిజం ఏమిటంటే విజయ్ హీరోగా అవ్వాలన్న తపన మహేష్ బాబు కారణంగానే కలిగిందట. మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చిన సినిమా పోకిరి.. అప్పట్లో ఇది ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో అందరికీ కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలోని మహేష్ బాబు ఎంట్రీ సీన్ అంటే విజయ్ దేవరకొండకు ఎంతో ఇష్టమట. పోకిరి సినిమాలో మహేష్ ఎంట్రీ సీన్ చూసిన టైంలోనే తను కూడా హీరో అవ్వాలని డిసైడ్ అయ్యాడట .. అసలైన హీరో ఇజం అంటే ఇది అనిపించిందని అందుకే ఆ నిమిషం హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు అవకాశం వస్తే అదే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. మరి విజయ్ కోరిక రాబోయే రోజుల్లో నెరవేరుతుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>