MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-health-updatec2bd7745-ccbc-4ed0-a944-a367b200773e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-health-updatec2bd7745-ccbc-4ed0-a944-a367b200773e-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయన హాస్పిటల్ లో కూడా చేరిన విషయం అందరికీ తెలిసిందే.. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల 30వ తేదీన చెన్నైలో ఉండే అపోలో హాస్పిటల్లో చేరిన రజనీకాంత్ కు అనంతరం వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున రాత్రి 12 గంటల సమయంలో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారట. సెప్టెంబర్ 30వ తేదీన అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి జాయిన్ చేసినట్లుగా తెలియజేశారు. అయితే ఈ RAJINIKANTH;HEALTH;UPDATE{#}Rajani kanth;september;Cinema;Directorరజనీకాంత్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే..?రజనీకాంత్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే..?RAJINIKANTH;HEALTH;UPDATE{#}Rajani kanth;september;Cinema;DirectorFri, 04 Oct 2024 10:48:00 GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయన హాస్పిటల్ లో కూడా చేరిన విషయం అందరికీ తెలిసిందే.. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల 30వ తేదీన చెన్నైలో ఉండే అపోలో హాస్పిటల్లో చేరిన రజనీకాంత్ కు అనంతరం వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున రాత్రి 12 గంటల సమయంలో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారట. సెప్టెంబర్ 30వ తేదీన అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి జాయిన్ చేసినట్లుగా తెలియజేశారు.



అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త ఆందోళన పడినప్పటికీ ఆ తర్వాత వైద్యులు వెంటనే రజనీకాంత్ హెల్త్ అప్డేట్ ని విడుదల చేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రజనీకాంత్ గుండెకు సంబంధించి రక్తనాళాల వాపు వచ్చిందని వీటి వల్లే ఆయన ఆసుపత్రికి చేరారని అందుకు స్టెంట్ అమర్చామని తెలిపారు.. ఆరోగ్యం కుదుటపడడంతో నిన్నటి రోజున డిశ్చార్జ్ చేశారట. అయితే రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా కోరుకోవడం జరిగింది.


ఆస్పత్రిలో చికిత్స తీసుకొని రజనీకాంత్ మూడు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారట. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ వైద్యులు తెలియజేశారు. కానీ రజనీకాంత్ ఒక వారం రోజులపాటు ఎలాంటి షూటింగ్లో  పాల్గొనకూడదని సూచించారు. గత కొంతకాలంగా రజినీకాంత్ వరుసగా చిత్రాల షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నారు. ఈనెల 10వ తేదీన రజనీకాంత్ నటించిన వెట్టయాన్ సినిమా విడుదల కాబోతోంది కానీ ఇటీవలే ఒక వ్యక్తి కోర్టులో కూడా ఈ సినిమాలోని సన్నివేశాల పైన కేసు వేసినట్లు సమాచారం. మరో సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో కూలి అనే చిత్రాలు నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చేయడానికి మరో కొన్ని వారాలు సమయం పడుతుందని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>