MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఇంకా చాలామంది పవన్ అభిమానులు పవన్ ను టాప్ హీరోగానే పరిగణిస్తూ ఆయన చేస్తున్న సినిమాల విడుదలకోసం అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమధ్య మీడియాలో ఎక్కడ చూసినా తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించిన వార్తలు లేకుండా కాలం గడవడం లేదు. గతవారం విడుదలైన ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డూ వివాదం పై హీరో కార్తీ మాట్లాడుతూ అది సున్నితమైన విషయం అని అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీడియాలో వైరల్ కPAVANKALYAAN{#}jayalalitha;Vijay Kanth;Comedian;Kshanam;Tirupati;kalyan;Joseph Vijay;Tamil;News;Yevaru;twitter;Hero;Eventకోలీవుడ్ ని షేక్ చేస్తున్న పవన్ మ్యానియా !కోలీవుడ్ ని షేక్ చేస్తున్న పవన్ మ్యానియా !PAVANKALYAAN{#}jayalalitha;Vijay Kanth;Comedian;Kshanam;Tirupati;kalyan;Joseph Vijay;Tamil;News;Yevaru;twitter;Hero;EventThu, 03 Oct 2024 08:32:17 GMTపవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఇంకా చాలామంది పవన్ అభిమానులు పవన్ ను టాప్ హీరోగానే పరిగణిస్తూ ఆయన చేస్తున్న సినిమాల విడుదలకోసం అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమధ్య మీడియాలో ఎక్కడ చూసినా తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించిన వార్తలు లేకుండా కాలం గడవడం లేదు.



గతవారం విడుదలైన ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డూ వివాదం పై హీరో కార్తీ మాట్లాడుతూ అది సున్నితమైన విషయం అని అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో ఈవిషయాన్ని పవన్ సీరియస్ గా తీసుకుని స్పందించిన విషయం తెలిసిందే. ఈవిషయం సీరియస్ గా మారడంతో కార్తీ వెనువెంటనే స్పందించి క్షమార్పణలు చెప్పడంతో అక్కడితో ఆవ్యవహారం సద్దుమణిగింది.



అయితే ఈవిషయం పై తమిళ ప్రజల వరకు వెళ్లడంతో తమిళ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా కొందరు పవన్ ని టార్గెట్ చేసుకుంటూ పలు ట్విట్టర్ హ్యాండిల్స్ యాక్టివ్ చేశారు. ఈవిషయాలు అన్నీ పవన్ దృష్టి వరకు వెళ్ళడంతో వ్యూహాత్మకంగా పవన్ వ్యవహరించినట్లు అర్థం అవుతోంది. పవన్ ఒక తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ భాషలో అనర్గళంగా మాట్లాడుతూ తమిళ సంస్కృతి గురించి ఆయన చేసిన కామెంట్స్ తమిళ మీడియాకు హాట్ టాపిక్ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా పవన్ వీలైనంత వరకు సరళంగా తమిళంలోనే సమాధానం చెప్పడంతో ఆ ఇంటర్వ్యూను చూసిన వారు షాక్ అవుతున్నారు.



సనాతన ధర్మం విజయ్ లియో విజయ్ కాంత్ ల ప్రస్తావనతో పాటు  అన్నా దురై ఎంజిఆర్ జయలలిత పై ప్రశంసలు కాలీవుడ్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా మధురై మాండలికం ఇలా అనేక విషయాలు ఆ ఇంటర్వ్యూలో పవన్ నోటివెంట విన్నవారు పవన్ కు తమిళ భాష పై ఉన్న పట్టును చూసి ఆశ్చర్యపోతున్నారు..  










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>