Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-820fa16d-c39f-4ad3-8f52-c8e480a86663-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-820fa16d-c39f-4ad3-8f52-c8e480a86663-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షోపై ఎప్పుడు భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇది గ్రేటెస్ట్ షో అని కొంతమంది ప్రేక్షకులు అంటుంటే.. ఇది వరస్ట్ షో దీనిని ఆపేస్తేనే బెటర్ మనీ మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు అలాగే ఉంటాయి. ఏకంగా సెలబ్రిటీలుగా ఇలా ఇంట్లోకి వెళ్లినవారు చీప్ చీప్ గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అంతే కాదు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ఉంటారు. వామ్మో మనుషులు ఇbigboss {#}Akkineni Nagarjuna;adhithya;Bigboss;Nijam;Audience;Telugu;Houseబిగ్ బాస్ 8 : చీప్ గేమ్ ఆడలేదు.. అందుకే అతని బయటికి పంపిస్తున్నారా?బిగ్ బాస్ 8 : చీప్ గేమ్ ఆడలేదు.. అందుకే అతని బయటికి పంపిస్తున్నారా?bigboss {#}Akkineni Nagarjuna;adhithya;Bigboss;Nijam;Audience;Telugu;HouseThu, 03 Oct 2024 18:30:00 GMTతెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షోపై ఎప్పుడు భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇది గ్రేటెస్ట్ షో అని కొంతమంది ప్రేక్షకులు అంటుంటే.. ఇది వరస్ట్ షో దీనిని ఆపేస్తేనే బెటర్ మనీ మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు అలాగే ఉంటాయి. ఏకంగా సెలబ్రిటీలుగా ఇలా ఇంట్లోకి వెళ్లినవారు చీప్ చీప్ గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అంతే కాదు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ఉంటారు.


 వామ్మో మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపించే విధంగా నడుచుకుంటూ ఉంటారు. అయితే ఇలా చీప్ గా గొడవలు పడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వారికే బిగ్ బాస్ హౌస్ లో మద్దతు కూడా ఉంటుంది. అలాంటి వారికే ఎక్కువగా ఓట్లు వేసి గెలిపిస్తూ ఉంటారు. ఇలా హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లి హుందాగా ఉందాము అనుకుంటే మాత్రం ఇక ఎలిమినేట్ చేసి బయటకు వెళ్ళగొట్టేస్తారు. ఇప్పటికే ఎంతోమంది కంటెస్టెంట్స్  విషయంలో ఇది నిజం అవ్వగా.. ఇప్పుడు సీజన్ 8 లో కూడా మరోసారి నిజం అవుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారట.


 ఎనిమిదవ సీజన్లో ఐదవ కంటెస్టెంట్ గా అటు హౌస్ లోకి వెళ్ళాడు ఆదిత్య ఓం. అతను ఇప్పటికే హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం. అయితే హౌస్ లో ఎప్పటి వరకు అందరూ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక కొంతమంది నోరు జారారు. అనుచిత వ్యాఖ్యలు కూడా చేసి నాగార్జున చేత క్లాస్ కూడా పీకించుకున్నారు. కానీ ఆదిత్య ఓం అలా కాదు ఒకవైపు టాస్కుల్లో అదరగొడుతూనే.. ఇంకోవైపు ఇంట్లో పనులు చేస్తున్నాడు. మరోవైపు గొడవల జోలికి పోకుండా ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు వరకు నాలుగు వారాలు గడిచిపోగా అతను ఒక్కరితో కూడా గొడవ పెట్టుకొని నోరు జారిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అయితే ఇలా హుందాగా ఉండడంతో నిర్వాహకులకు కూడా పెద్దగా ఆదిత్య ఓం నుంచి కంటెంట్ దొరకట్లేదు. ఇంకేముంది ఈ హుందా మనిషిని అంతే హుందాగానే బయటకి పంపించాలని నిర్ణయించేసారు. ఇక ఈ వారం ఆదిత్యను ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురావాలని అనుకుంటున్నారట నిర్వాహకులు. అయితే ఈ విషయం తెలిసి అతను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా జెన్యూన్ పర్సన్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎక్కడ అగ్రేషన్ కి గురి కాలేదు. మంచి వ్యక్తిని బయటికి తీసుకురావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>