EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vinesh2e4dcc21-4530-41d2-97b3-2955218997b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vinesh2e4dcc21-4530-41d2-97b3-2955218997b9-415x250-IndiaHerald.jpgఇటీవల ముగిసిన పారిస్ 2024 ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హత తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు తాను నిరాకరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని కాల్ తిరస్కరిండానికి గత కారణాన్ని వెల్లడించారు. అవును.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తాను పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్ పోటీలో అనర్హతకు గురైనప్పుడు మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడvinesh{#}Narendra Modi;Ishtam;Paris;Smart phone;Prime Minister;media;Congressప్రధాని మోదీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదా? ఎవరా పర్సన్..!ప్రధాని మోదీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదా? ఎవరా పర్సన్..!vinesh{#}Narendra Modi;Ishtam;Paris;Smart phone;Prime Minister;media;CongressThu, 03 Oct 2024 11:16:00 GMTఇటీవల ముగిసిన పారిస్ 2024 ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హత తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు తాను నిరాకరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని కాల్ తిరస్కరిండానికి గత కారణాన్ని వెల్లడించారు.


అవును.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తాను పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్ పోటీలో అనర్హతకు గురైనప్పుడు మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడటానికి నిరాకరించినట్లు చెప్పారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కీలక విషయాలు వెల్లడించారు.


ఇందులో భాగంగా తనపై అనర్హత వేటు పడిన సమయంలో ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని.. అయితే తాను మాట్లాడటానికి నిరాకరించరానని.. కాల్ నేరుగా తనకు రాలేదని..  అక్కడ ఉన్న భారత అధికారులు పీఎం తనతో మాట్లాడలనుకుంటున్నట్లు చెప్పారని.. ఆ సమయంలో తాను సిద్ధంగానే ఉన్నానని ఆమె తెలిపారు.  ఆ సమయంలో అధికారులు కొన్ని షరతులు పెట్టారని ప్రధాని మోదీ వైపు నుంచి ఇద్దరు వ్యక్తుల సోషల్ మీడియా కోసం సంభాషణను రికార్డ్ చేస్తారని చెప్పారని అన్నారు.


దాంతో.. తన భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తనకు ఇష్టం లేనందున కాల్ తిరస్కరించినట్లు ఆమె చెప్పారు. సంభాషనను ప్రచారం చేసే కండిషన్ లేకండా ప్రధాని నుంచి నిజమైన కాల్ వస్తే తాను తప్పకుండా అభినందించేదాన్ని ఆయన నిజంగా అథ్లెట్ల గురించి శ్రద్ధ వహిస్తే.. రికార్డు ప్రస్థావన రాకుండా కాల్ చేసి ఉండేవారని కానీ పీఎం మోదీ కార్యాలయం  షరతులు విధించిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేరుగా నాతో మాట్లాడితే గత రెండేళ్లలో జరిగిన దాని గురించి అడుగుతాననే విషయం మోదీకి తెలిసి ఉండొచ్చు. బహుశా అందుకేనేమో నా వైపు నుంచి ఫోన్ మాట్లాడే బృందం ఉండకూడదని అధికారులకు సూచించారని.. అలా అయితే వారు మాట్లాడిన వీడియో వారికి అనుకూలంగా ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదని.. తాను ఒరిజినల్ కాల్ బయట పెడతానని వారికి తెలుసని ఆమె అన్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>