MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgక్రిష్ అనుష్క ల కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘వేదం’ అప్పట్లో ట్రెండ్ సెటర్ మూవీ. ఆతరువాత వారిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ‘బాహుబలి’ తరువాత నేషనల్ వైడ్ గా ఇమేజ్ వచ్చినప్పటికీ అనుష్క కు సరైన అవకాశాలు లేవు. గత సంవత్సరం విడుదల అయిన ‘మిస్ శెట్టి మిష్టర్ పోలి శెట్టి’ మూవీ విజయవంతం అయినప్పటికీ ఆతరువాత అనుష్క రకరకాల కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య క్రిష్ అనుష్కల కాంబినేషన్ లో ఒక మూవీ ప్రారంభయం అయింది అన్న విషయం మీడియాకు కూడ తెలియకుండా ఆమూవీ షూటింగ్ ను పరుANUSHKA{#}anoushka;Chitram;News;Cinema;Heroineఅనుష్క కెరియర్ ను మలుపు తిప్పబోతున్న ఘాటీ !అనుష్క కెరియర్ ను మలుపు తిప్పబోతున్న ఘాటీ !ANUSHKA{#}anoushka;Chitram;News;Cinema;HeroineThu, 03 Oct 2024 09:42:00 GMTక్రిష్ అనుష్క ల కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘వేదం’ అప్పట్లో ట్రెండ్ సెటర్ మూవీ. ఆతరువాత వారిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ‘బాహుబలి’ తరువాత నేషనల్ వైడ్ గా ఇమేజ్ వచ్చినప్పటికీ అనుష్క కు సరైన అవకాశాలు లేవు. గత సంవత్సరం విడుదల అయిన ‘మిస్ శెట్టి మిష్టర్ పోలి శెట్టి’ మూవీ విజయవంతం అయినప్పటికీ ఆతరువాత అనుష్క రకరకాల కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది.



ఇలాంటి పరిస్థితుల మధ్య క్రిష్ అనుష్కల కాంబినేషన్ లో ఒక మూవీ ప్రారంభయం అయింది అన్న విషయం మీడియాకు కూడ తెలియకుండా ఆమూవీ షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నారు. ఈమధ్యనే ఒరిస్సాలో ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేయాలని ఈ మూవీ దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.



తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో అనుష్క కరడుకట్టిన లేడీ డాన్ ల కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కథ రీత్యా ఆమె అత్యంత క్రూరమైన లేడీ డాన్ లా ఈమూవీలో కనిపిస్తుందని టాక్. ఈ మూవీ కథ అనుష్కకు బాగా నచ్చడంతో తనకు కలిసివచ్చిన క్రిష్ కాంబినేషన్ ను నమ్ముకుని చాల గ్యాప్ తరువాత ఈ మూవీలో నటిస్తోంది.



ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ హవా విపరీతంగా కొనసాగుతున్న నేపద్యంలో తనకు నచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను అప్పుడప్పుడు చేస్తోంది. ‘హరి హర వీరమల్లు చిత్రం ఆలస్యం అవ్వడంతో ఆమూవీ దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న క్రిష్ చాల మనసుపెట్టి ఈ మూవీని చేస్తున్నాడని సంకేతాలు వస్తున్నాయి. మంచి సామాజిక చైతన్యంతో ఉండే కథలను సినిమాలుగా మార్చే విషయంలో చేయి తిరిగిన క్రిష్ ఈ మూవీతో సక్సస్ సాధించ గలిగతే అనుష్క కెరియర్ మళ్ళీ ట్రెండింగ్ లోకి మారే ఆస్కారం ఉంది అనుకోవాలి..  












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>