MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayam-ravi-aarti-priyanka-mohan-saripoda-sanivaaram-movie-brother-movie7b88dd5a-2a2e-4dfb-afb7-4334610d5117-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayam-ravi-aarti-priyanka-mohan-saripoda-sanivaaram-movie-brother-movie7b88dd5a-2a2e-4dfb-afb7-4334610d5117-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న జయం రవి అంటే సౌత్ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అయితే రీసెంట్ గా ఆయన పేరు మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. దానికి కారణం తన భార్యతో విడాకులు తీసుకోవడమే.. దాదాపు 15 ఏళ్లు కలిసి కాపురం చేసిన జయం రవి, ఆర్తిల విడాకులు ఎంతో మంది అభిమానులను బాధపెట్టాయి. అయితే విడాకులపై ఆర్తి బెట్టు చేస్తూనే ఉంది. తనకు విడాకులు వద్దు అన్నట్లే మాట్లాడుతోంది. కానీ జయం రవి మాత్రం పట్టు బట్టి భార్యకు విడాకులు ఇస్తున్నారు.అయితే మొన్ననే విడాకులు ప్రకటించిన జయం రవి తాజాగా నాని హీరోJAYAM RAVI, AARTI, PRIYANKA MOHAN, SARIPODA SANIVAARAM MOVIE, BROTHER MOVIE{#}aarthi,Jayam,jayam ravi,Nijam,Saturday,Nani,marriage,priyanka,Heroine,BEAUTY,Tollywood,Cinemaనాని హీరోయిన్ తో జయం రవి రెండో పెళ్లి.. రహస్యంగా ఎంగేజ్మెంట్..?నాని హీరోయిన్ తో జయం రవి రెండో పెళ్లి.. రహస్యంగా ఎంగేజ్మెంట్..?JAYAM RAVI, AARTI, PRIYANKA MOHAN, SARIPODA SANIVAARAM MOVIE, BROTHER MOVIE{#}aarthi,Jayam,jayam ravi,Nijam,Saturday,Nani,marriage,priyanka,Heroine,BEAUTY,Tollywood,CinemaThu, 03 Oct 2024 17:10:00 GMTకోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న జయం రవి అంటే సౌత్ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అయితే రీసెంట్ గా ఆయన పేరు మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. దానికి కారణం తన భార్యతో విడాకులు తీసుకోవడమే.. దాదాపు 15 ఏళ్లు కలిసి కాపురం చేసిన జయం రవి, ఆర్తిల విడాకులు ఎంతో మంది అభిమానులను బాధపెట్టాయి. అయితే విడాకులపై ఆర్తి బెట్టు చేస్తూనే ఉంది. తనకు విడాకులు వద్దు అన్నట్లే మాట్లాడుతోంది. కానీ జయం రవి మాత్రం పట్టు బట్టి భార్యకు విడాకులు ఇస్తున్నారు.అయితే మొన్ననే విడాకులు ప్రకటించిన జయం రవి తాజాగా నాని హీరోయిన్ తో పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు కూడా సమాచారం. ఇక జయం రవి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియాంక మోహన్..

రీసెంట్ గానే నాని హీరోగా చేసిన సరిపోదా శనివారం మూవీతో టాలీవుడ్ లో హిట్టు కొట్టిన ఈ బ్యూటీ నీ జయం రవి రెండో పెళ్లి చేసుకోబోతున్నారని,గోవాలో రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారంటూ దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజెన్స్ ఓహో ఇదా అసలు మ్యాటర్.. అందుకే భార్యకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా.. అంటూ జయం రవి పై షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొంత మందేమో అసలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫోటోస్ లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే అవి కేవలం సినిమా షూట్లో భాగమే.

ఎందుకంటే జయం రవి హీరోగా చేస్తున్న బ్రదర్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటలో వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్నట్టు కనిపిస్తారు.దానికి సంబంధించిన ఫోటోలే ఇవి.. వీళ్లిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోలేదు అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ లో ఉన్నది ఎంత నిజం..నిజంగానే వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారా.. లేదా సినిమాలోని ఫోటోలా అనేది తెలియాల్సి ఉంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>