EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/konda-surekha-aafefb7d-f8a3-482d-8276-0f249060190a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/konda-surekha-aafefb7d-f8a3-482d-8276-0f249060190a-415x250-IndiaHerald.jpgసోదరభావంతో తన మెడలో వేసిన నూలు దండకు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పెట్టిన పోస్టుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గాంధీ జయంతి రోజున చెలరేగిపోయిన వైనంతో ఆమె వార్తల్లో ప్రధాన వార్తగా మారిపోయారు. సినీ రంగానికి చెందని ప్రముఖులకు సంబంధించి సూటిగా.. ఎలాంటి మెహమాటం లేకండా వారి వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడిన వైనం.. దానికి మాజీ మంత్రి కేటీఆర్ కు లింకు పెడతూ చేసిన వ్యాఖ్యలతో వ్యవహారం మొత్తం మారిపోయింది. కొండా సురేఖ వ్యాఖ్యలతో ప్రధాన మీడియా మొదలు సోషల్ మీడియా వరkonda surekha {#}Jayanthi;revanth;Telangana;media;Tollywood;naga;Minister;Samantha;surekha vaniకాంగ్రెస్ ప్లాన్ మామూలుగా లేదుగా.. దెబ్బకి హైడ్రా వెనక్కి వెళ్లిపోయిందిగా?కాంగ్రెస్ ప్లాన్ మామూలుగా లేదుగా.. దెబ్బకి హైడ్రా వెనక్కి వెళ్లిపోయిందిగా?konda surekha {#}Jayanthi;revanth;Telangana;media;Tollywood;naga;Minister;Samantha;surekha vaniThu, 03 Oct 2024 11:54:00 GMTసోదరభావంతో తన మెడలో వేసిన నూలు దండకు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పెట్టిన పోస్టుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గాంధీ జయంతి రోజున చెలరేగిపోయిన వైనంతో ఆమె వార్తల్లో ప్రధాన వార్తగా మారిపోయారు. సినీ రంగానికి చెందని ప్రముఖులకు సంబంధించి సూటిగా.. ఎలాంటి మెహమాటం లేకండా వారి వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడిన వైనం.. దానికి మాజీ మంత్రి కేటీఆర్ కు లింకు పెడతూ చేసిన వ్యాఖ్యలతో వ్యవహారం మొత్తం మారిపోయింది.


కొండా సురేఖ వ్యాఖ్యలతో ప్రధాన మీడియా మొదలు సోషల్ మీడియా వరకు ఆమె మాటలే హెడ్ లైన్స్ గా మారాయి. దీనికి తోడు.. ఆమె మాటల్ని తీవ్రంగా తప్పు పడుతూ సినీ రంగానికి చెందని పలువురు గళమెత్తడం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ కారణంగానే నాగ చైతన్య, సమంత విడిపోయారు అన్న కొండా సురేఖ వ్యాఖ్యలు సంచలనానికి.. అంతకు మించి పెను దుమారానికి కారణం అయ్యాయి.


ఆమె వ్యాఖ్యల్ని కేటీఆర్, అక్కినేని నాగార్జున, అమల, సమంత ప్రకాశ్ రాజ్, చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖులు సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఈ జోరకు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వార్తల ప్రధాన్యం మారిపోయాయి. అందరూ ఇప్పుడు కేటీఆర్, సమంత, నాగ చైతన్యల మీద మాట్లాడుకోవడం ఎక్కువైంది.


అయితే ఇదంతా.. ఒక ఎత్తు అయితే తాజా పరిణామంతో ఇప్పటి వరకు హాట్ టాపిక్ గా ఉన్న హైడ్రా వెనక్కి వెళ్లిపోయింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి సురేఖ మాట్లాడిన మాటల సంగతేమైనా.. ఆమె కారణంగా రేవంత్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న హైడ్రా వ్యవహారం తెర వెనక్కి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. మంత్రి సురేఖ మాటల మంటలు ఏ మేరకు వ్యాపిస్తున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో తాజాగా మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>