Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa263f2fcc7-d737-4340-bf79-9b70c8590a45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa263f2fcc7-d737-4340-bf79-9b70c8590a45-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగింది.ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమాగా వుండే తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది.. గతంలో ఇండియన్ సినిమా అంటే గుర్తుకు వచ్చేది కేవలం బాలీవుడ్ మాత్రమే అంతలా హిందీ సినిమాలు ఇంపాక్ట్ తీసుకువచ్చాయి.. కానీ గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్థాయి తగ్గుతూ వస్తుంది.. బడా స్టార్ హీరోలు సైతం డిజాస్టర్ సినిమాలు అందిస్తున్నారు.. మధ్యలో షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు మురిపించిన ఇండస్ట్రీ ఇప్పటిలో కోలుకునేలా లేదు.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని దర్శకధీరుడు రా#pushpa2{#}Shahrukh Khan;sukumar;RRR Movie;Oscar;Bahubali;Hindi;Industry;Audience;Rajamouli;Hero;Telugu;Cinema;bollywood;NTR;Indianదేవ‌ర దెబ్బ‌కే వ‌ణుకుతోన్న బాలీవుడ్‌... పుష్ప 2 పేరు చెపితే ఎందుకు వ‌ణుకుతోంది...?దేవ‌ర దెబ్బ‌కే వ‌ణుకుతోన్న బాలీవుడ్‌... పుష్ప 2 పేరు చెపితే ఎందుకు వ‌ణుకుతోంది...?#pushpa2{#}Shahrukh Khan;sukumar;RRR Movie;Oscar;Bahubali;Hindi;Industry;Audience;Rajamouli;Hero;Telugu;Cinema;bollywood;NTR;IndianThu, 03 Oct 2024 10:00:00 GMTప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగింది.ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమాగా వుండే తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది.. గతంలో ఇండియన్ సినిమా అంటే గుర్తుకు వచ్చేది కేవలం బాలీవుడ్ మాత్రమే అంతలా హిందీ సినిమాలు ఇంపాక్ట్ తీసుకువచ్చాయి.. కానీ గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్థాయి తగ్గుతూ వస్తుంది.. బడా స్టార్ హీరోలు సైతం డిజాస్టర్ సినిమాలు అందిస్తున్నారు.. మధ్యలో షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు మురిపించిన ఇండస్ట్రీ ఇప్పటిలో కోలుకునేలా లేదు.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని దర్శకధీరుడు రాజమౌళి అమాంతం పెంచేసాడు..బాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం నివ్వెర పోయేలా బాలీవుడ్ లో బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.. బాహుబలి అనుకుంటే అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా సృష్టించిన అరాచకం వేరు.. ఆ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. పుష్ప బాలీవుడ్ లో భారీగా కలెక్షన్స్ రాబట్టింది.. ఇక అప్పటి నుండి తెలుగు సినిమా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తూనే వుంది.. 

రాజమౌళి నుంచి మరో అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ దర్శకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.. ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది..టాలీవుడ్ లో ప్రతి స్టార్ హీరో సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ ని డామినేట్ చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటు ముందుకు సాగుతుంది. భవిష్యత్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ  చాలా సంవత్సరాల పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు సినీ ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక బాలీవుడ్ హీరోలు దర్శకులు తెలుగు సినిమా వైభవం చూసి కుళ్ళు కుంటున్నారు.రీసెంట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో  మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించారు.. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో దాదాపు 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది..ముందు ముందు భారీ కలెక్షన్లను రాబడుతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేవర ప్రభంజనానికే వణుకుతున్న బాలీవుడ్ పుష్ప 2 సినిమా వస్తే ఎలా తట్టుకుంటుందో మరీ.పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది…ఏకంగా 200 కోట్ల టార్గెట్ తో వస్తున్న పుష్ప 2 కి బాలీవుడ్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కనుక పుష్ప గాడి జోరు ఆపడం ఎవరి వల్ల కాదు.. మరీ బాలీవుడ్ పై పుష్ప గాడి రూల్ ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో చూడాలి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>