Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-news-about-new-liquor-policy21b89cbb-cffb-4585-b383-c0d3d7796d03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-news-about-new-liquor-policy21b89cbb-cffb-4585-b383-c0d3d7796d03-415x250-IndiaHerald.jpgమందు మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సాంప్రదాయం.. నాని హీరోగా నటించిన దసరా మూవీలో ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అయింది. డైరెక్టర్ కూడా ఇక ఇదే ఊహించి రాశాడేమో. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజల ఎంత మద్యం ప్రియులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి అటు కెసిఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఇక ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కూడా అటు తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది కానీ తగ్గలేదు. chandrababu{#}Good news;Good Newwz;revanth;Goa;Air;Nani;Director;Telangana;Dussehra;Vijayadashami;CM;Telugu;Jagan;Andhra Pradeshచంద్రబాబు కొత్త లిక్కర్ పాలసీ.. మహిళలు మళ్లీ జగన్ ను గుర్తు చేసుకుంటారా?చంద్రబాబు కొత్త లిక్కర్ పాలసీ.. మహిళలు మళ్లీ జగన్ ను గుర్తు చేసుకుంటారా?chandrababu{#}Good news;Good Newwz;revanth;Goa;Air;Nani;Director;Telangana;Dussehra;Vijayadashami;CM;Telugu;Jagan;Andhra PradeshWed, 02 Oct 2024 11:30:00 GMTమందు మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సాంప్రదాయం.. నాని హీరోగా నటించిన దసరా మూవీలో ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అయింది. డైరెక్టర్ కూడా ఇక ఇదే ఊహించి రాశాడేమో. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజల ఎంత మద్యం ప్రియులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి అటు కెసిఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఇక ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కూడా అటు తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది కానీ తగ్గలేదు.


 దీంతో తెలంగాణలో మందుబాబుల ఆనందానికి ఎక్కడ బ్రేకుల పడలేదు. కావాల్సినంత మద్యం అందుబాటులో ఉంది. కానీ ఏపీలో మాత్రం గతంలో జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుగా మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం హామీని మరిచిపోయారు. మద్యం ధరలను భారీగా పెంచి సామాన్యుడికి మద్యాన్ని అందుబాటులో లేకుండా చేశారు. ఇక ఇలా చేయడం వల్ల ఎంతోమంది నకిలీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయ్.


 అయితే ఇక ఇప్పుడు ఏపీ కొత్త సీఎం చంద్రబాబు కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చారు. మందుబాబులందరికీ గుడ్ న్యూస్ చెప్పేశారు. 99 రూపాయలకే క్వార్టర్ మందు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 3400కు పైగా మద్యం షాపులను పెట్టేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా గోవాలో తక్కువ ధరకు మద్యం దొరుకుతుంది  ఇక ఇప్పుడు గోవా కంటే తక్కువగా ఏపీలో మద్యం అందించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీంతో ఏపీలో మందుబాబుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


అయితే మద్యం ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడు తగ్గిన ధరలతో మద్యానికి బానిసగా మారే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇలా కుటుంబ పెద్దలు ఒకవేళ మందుకు బానిసలుగా మారిపోతే.. ఇక కుటుంబ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మళ్లీ మహిళలు అటు సామాన్యుడికి అందుబాటులో ఉండకుండా చేసేందుకు ప్రయత్నించిన జగన్ ను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


 జగన్ ప్రభుత్వ హయాంలోనే బాగుండేది మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో.. మా మధ్యతరగతి కుటుంబాలు మద్యం జోలికి పోవాలంటే భయపడేవని.. కానీ ఇప్పుడు తక్కువ ధరలు కారణంగా మితిమీరిన మద్యం తాగుతూ కుటుంబ నిర్వహణను మా మొగుళ్ళు గాలి వదిలేస్తున్నారని అప్పుడు జగన్  హయాంలోనే పరిస్థితి బాగుండేదని మహిళలు అనుకునే ఛాన్స్ ఉంది అంటూ కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>