MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/september-613341aa-3100-42bd-abe2-f71dabfac005-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/september-613341aa-3100-42bd-abe2-f71dabfac005-415x250-IndiaHerald.jpgఇప్పటికే 2024గు చివరి దసుకు వచ్చేసింది ఈ క్రమంలో గత నెల సెప్టెంబర్ లో బాక్సాఫీస్ కాస్త భిన్నంగా నడిచింది.. పెద్ద సినిమా మీడియం, చిన్న సినిమాలు కూడా ఒకేసారి వచ్చాయి.. వాటి రిజల్ట్ విషయం కాస్త పక్కన పెడితే.. రెండు చిన్న సినిమాలు పై ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తికరమైన చర్చ నడిచింది. September {#}arvind swamy;Kathanam;sathyam;satya;Audience;september;Music;Cinema;NTRసెప్టెంబర్ బాక్స్ ఫీస్ రిపోర్ట్.. ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న సినిమాలు ఇవే..!సెప్టెంబర్ బాక్స్ ఫీస్ రిపోర్ట్.. ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న సినిమాలు ఇవే..!September {#}arvind swamy;Kathanam;sathyam;satya;Audience;september;Music;Cinema;NTRWed, 02 Oct 2024 12:32:00 GMT2024 బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను మెప్పించాయి.. ఇప్పటికే 2024గు చివరి దసుకు వచ్చేసింది ఈ క్రమంలో గత నెల సెప్టెంబర్ లో బాక్సాఫీస్ కాస్త భిన్నంగా నడిచింది.. పెద్ద సినిమా మీడియం, చిన్న సినిమాలు కూడా ఒకేసారి వచ్చాయి.. వాటి రిజల్ట్ విషయం కాస్త పక్కన పెడితే.. రెండు చిన్న సినిమాలు పై ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తికరమైన చర్చ నడిచింది.

ఇక సెప్టెంబర్ తొలి వారంలో పెద్ద సినిమాలు ఏం లేవు.. ఒక విజ‌య్‌ నటించిన గోట్‌ సినిమా తమిళ జనాలకు పెద్దది మనకు కాదు అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఇక అదే వారం వచ్చిన 35 చిన్న కథ కాదు అనే సినిమా బాగా ఆకట్టుకుని ఎంతో మందిని ఆలోచింపజేసింది. భావోద్వేగాలతో కూడిన ఓ మంచి కథను మనసుకు హట్టుకునే కథనం తోడైతే దానికి నివేద థామస్ లాంటి గొప్ప నటి ఆడ్ అయితే ఫలితంగా ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది సంగీతం నందకిషోర్‌ దర్శకత్వం సినిమాకు అదనపు బలాలుగా నిలిచారు.

అలా ఓ మంచి సినిమాతో మొదలైన సెప్టెంబర్ బాక్స్ ఫీస్ రెండో వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చే మత్తు వదలరా2 సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి కామెడియన్ సత్య కామెడీ తో గట్టెక్కింది.  ఇక  అదేవారం వచ్చిన భలే ఉన్నాడే, ఉత్సవం, ఏఆర్ ఏమ్‌ సినిమాలు అంత‌గాా మెప్పించలేదు. అలాగే మూడో వారంలో ఆరడజన‌కు పైగా సినిమాలు వచ్చిన వాటిలో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదు. అయితే సుహాస్‌ నటించిన గోర్రే పురాణం ఇందులో ఒకటి ప్రచారం లోపం కారణంగా ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.  ఇక ఈనెల చివరి వారంలో అందరూ ఎదురుచూసిన దేవర‌ సినిమా వచ్చింది.. అర్ధరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి మిక్స్‌డ్‌ టాక్ కూడా అప్పటి నుంచి మొదలైంది. ఎన్టీఆర్ స్టార్ పవర్ తో మొదటి వారం అంతా మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రేక్షకులకు తగ్గట్టు సినిమా లేదు.. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ పై పెదవి ఎరుపులు కూడా ఉన్నాయి.

అలాగే దేవరతో పాటు అదే వారంలో సత్యం సుందరం అనే మూవీ కూడా వచ్చింది. కార్తీ అరవింద్ స్వామి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అయితే థియేటర్లో కలెక్షన్లు మాత్రం అంతగా లేవు.  ఈ విధంగా సెప్టెంబర్ నెలలో దాదాపు 18 సినిమాలకు పైగా ప్రేక్షకుల ముందుకు రాగా వాటిలో మత్తు వదలరా2 , 35 చిన్న కథ కాదు, సత్యం సుందరం వంటి సినిమాలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నయి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలనే సరికొత్త చర్చకు దారితీసింది ఎన్టీఆర్ దేవర సినిమా రిజ‌ల్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>