BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chian46d908a0-1c0f-46f1-8e40-42bc6846fd65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chian46d908a0-1c0f-46f1-8e40-42bc6846fd65-415x250-IndiaHerald.jpgతమ దేశం ముందు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తెలిపారు. రానున్న రోజుల్లో తీవ్ర సవాళ్లు ఎదురు కావొచ్చని వివరించారు. భారత సహా పొరుగు దేశాలతో పెరుగుతున్న సవాళ్లు.. అమెరికాతో తీవ్ర పోటీ, ఆర్థికంగా ప్రతికూల గాలులు వీయడం లాంటివి ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చారు. 75 వ జాతీయ దినోత్సవం సందర్భంగా బీజింగ్ లోని తియానన్ స్క్వేర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్ పింగ్ మాట్లాడారు. కాగా.. మున్ముందు చైనాకు ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఎదురుకావొచ్చు అని అధ్యక్షుడు జిన్ పింగ్ పేchian{#}Beijingచైనా పని అయిపోయిందా? అక్కడ ముందంతా గడ్డు కాలమేనా?చైనా పని అయిపోయిందా? అక్కడ ముందంతా గడ్డు కాలమేనా?chian{#}BeijingWed, 02 Oct 2024 10:01:00 GMTతమ దేశం ముందు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తెలిపారు. రానున్న రోజుల్లో తీవ్ర సవాళ్లు ఎదురు కావొచ్చని వివరించారు. భారత సహా పొరుగు దేశాలతో పెరుగుతున్న సవాళ్లు.. అమెరికాతో తీవ్ర పోటీ, ఆర్థికంగా ప్రతికూల గాలులు వీయడం లాంటివి ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చారు.


75 వ జాతీయ దినోత్సవం సందర్భంగా బీజింగ్ లోని తియానన్ స్క్వేర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్ పింగ్ మాట్లాడారు. కాగా.. మున్ముందు చైనాకు ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఎదురుకావొచ్చు అని అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అని సూచించారు. మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాలి అని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీతో పాటు మొత్తం సైన్యం, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉండాలన్నారు. అప్పుడు ఏ కష్టాలు వచ్చినా చైనాను ఏం చేయలేవు అని జిన్ పింగ్ పేర్కొన్నారు.


తైవాన్ స్వాంతత్ర్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. అది తమ దేశంలో భాగమేనని అన్నారు. జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు మధ్య రక్త సంబంధం ఉందని డ్రాగన్ కంట్రీ అధినేత అన్నారు. ఇక అంతర్గత సమస్యలు, మందగించిన స్థిరాస్తి మార్కెట్, చైనా ఎలక్ర్టిక్ వెహికిల్స్, బ్యాటరీలపై అమెరికా, ఈయూ అధిక పన్నులు విధించడం లాంటి సవాళ్లను చైనా ప్రస్తుతం ఎదుర్కొంటుందని అన్నారు.


ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి సంస్కరణలు చాలా అవసరం అని జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>