MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-vijay-with-balayya4b8bd031-2a5f-4cab-abb9-ef48a651a64c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-vijay-with-balayya4b8bd031-2a5f-4cab-abb9-ef48a651a64c-415x250-IndiaHerald.jpgవాటిలో దళపతి 69వ సినిమాగా వచ్చే మూవీనే విజయ్ లాస్ట్ మూవీ అని అధికార ప్రకటన వచ్చింది. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన స్టార్ క్యాస్టింగ్ కూడా మేకర్స్ అధికారికంగాా ప్రకటిస్తున్నారు. ఇలా ఈ విషయం ఇలా ఉంచితే ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బాలయ్య భగవంత్ కేసరి కు రీమేక్ గా కోలీవుడ్లో తెరకెక్కుతోందని అంటున్నారు. Vijay with Balayya{#}Dalapathi;anil ravipudi;Joseph Vijay;Pooja Hegde;Kesari;Balakrishna;Telugu;Cinemaబాలయ్యతో దళపతి విజయ్.. ఇక ఆ సినిమాతో బాక్స్ ఫీస్ బద్దలే..!బాలయ్యతో దళపతి విజయ్.. ఇక ఆ సినిమాతో బాక్స్ ఫీస్ బద్దలే..!Vijay with Balayya{#}Dalapathi;anil ravipudi;Joseph Vijay;Pooja Hegde;Kesari;Balakrishna;Telugu;CinemaWed, 02 Oct 2024 12:35:00 GMTకోలీవుడ్ దళపతి విజయ్ సినిమాలుకు గుడ్ బై చెపి పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించిన విజయ్‌ తాను సినిమాలకు గుడ్ బాయ్ చెప్తున్నట్లు కూడా అధికంగా ప్రకటించాడు.  రీసెంట్ గా వచ్చిన ది గోట్‌ సినిమానే విజయ్ చివరి మూవీ అనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ దిగోట్ తర్వాత విజయ్ మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో దళపతి 69వ సినిమాగా వచ్చే  మూవీనే విజయ్ లాస్ట్ మూవీ అని అధికార ప్రకటన వచ్చింది. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన స్టార్ క్యాస్టింగ్ కూడా మేకర్స్ అధికారికంగాా ప్రకటిస్తున్నారు. ఇలా ఈ విషయం ఇలా ఉంచితే ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బాలయ్య భగవంత్ కేసరి కు రీమేక్ గా కోలీవుడ్లో తెరకెక్కుతోందని అంటున్నారు.

బాలకృష్ణ హీరోగా స్టార్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర్కక్కించిన ఈ మూవీ గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో శ్రీ లీల, కాజల్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య పాత్రను విజయ్ చేస్తుండగా, శ్రీ లీల పాత్రలో మమిత కనిపించబోతున్నారు. భగవంత్ కేస‌రిలో బాలయ్య, శ్రీలీల‌ తండ్రి కూతుర్లుగా కనిపించక,  వయసు రిత్యా ఈ కథను అన్నా చెల్లెల మధ్య నడిచే కథగా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఇక హీరోయిన్గా చేసిన కాజల్ పాత్రలో పూజ హెగ్డే నటిస్తున్నారు. బాలయ్యకు దీటుగా విల‌నిజం పండించిన అర్జున్ రాంపాల్ పాత్రను బాబు డ్యూయల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్‌కు తగ్గట్టు ఈ కథను మార్చి హెచ్ వినోద్ ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం.

నిజం చెప్పాలంటే అసలు విజయ్ ను నిలబెట్టిందే తెలుగు రీమేక్స్. ఒక్కడు, ఖుషి, నువ్వు నాకు నచ్చావ్.. ఇలా చెప్పుకుంటూపోతే విజయ్ హిట్స్ అందుకున్న సినిమాలు అన్ని రీమేక్సే. దీంతో విజయ్ చివరి చిత్రం కూడా రీమేక్ అవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో విజయ్ ఒక మంచి హిట్ ను అందుకున్నట్లు దాఖలాలు లేవు. వారసుడు, లియో, ది గోట్ .. వరుసగా పరాజయాలనే చవిచూశాడు. మరి ఈ చివరి చిత్రం కూడా కొత్త కథతో వెళ్తే పరాజయాన్ని అందుకోక తప్పదేమో అన్న భయంతో అతనికి కలివచ్చిన  రీమేక్ నే నమ్ముకున్నాడు అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>