Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/---a1a25b6d-314a-45be-ab98-7441cf0fbe4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/---a1a25b6d-314a-45be-ab98-7441cf0fbe4d-415x250-IndiaHerald.jpgఇంటర్నెట్లో ఎప్పుడు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోలు సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉంటే.. ఇంకొన్ని వీడియోలు అందరినీ భయపెడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన ఒక వీడియో అందరికీ ఒక మెసేజ్ ఇస్తుంది. బలం ఉందని విర్రవీగితే ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు అనే ఒక మెసేజ్ వైరల్ గా మారిపోయిన వీడియో ద్వారా సోషల్ మీడియా జనాలు అందరికీ కూడా చేరుతూ ఉంది. ఎందుకంటే సర్పాలన్నింటిలో బలం లో అత్యంత శక్తివంతమైన పాము ఏది అంటే కొండచిలువ పేరు చెబుతారు. వైరల్{#}prakruti;Patti;netizens;media;Yevaru;Manamకొండచిలువను చంపేసిన చీమలు.. బలం ఉందని విర్రవీగితే?కొండచిలువను చంపేసిన చీమలు.. బలం ఉందని విర్రవీగితే?వైరల్{#}prakruti;Patti;netizens;media;Yevaru;ManamWed, 02 Oct 2024 17:56:00 GMTఇంటర్నెట్లో ఎప్పుడు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోలు సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉంటే.. ఇంకొన్ని వీడియోలు అందరినీ భయపెడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన ఒక వీడియో అందరికీ ఒక మెసేజ్ ఇస్తుంది. బలం ఉందని విర్రవీగితే ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు అనే ఒక మెసేజ్ వైరల్ గా మారిపోయిన వీడియో ద్వారా సోషల్ మీడియా జనాలు అందరికీ కూడా చేరుతూ ఉంది.


 ఎందుకంటే సర్పాలన్నింటిలో బలం లో అత్యంత శక్తివంతమైన పాము ఏది అంటే కొండచిలువ పేరు చెబుతారు. ఒక్కసారి కొండచిలువ దాడి చేస్తే  భారీ జంతువుల సైతం ప్రాణాలు వదలాల్సిందే. ఆ రేంజ్ పట్టుబడుతుంది కొండచిలువ. అలాంటి కొండచిలువను ఇక్కడ చీమలు చంపేసాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి అని చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఇక ఇప్పుడు నిజమైంది. బలం ఉందని విర్రవీగితే ఎంతటి వారికైనా పరాభవం తప్పదని ఇక అప్పుడు మనం చదువుకున్న పద్యమే కాదు.. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో కూడా అర్థమయ్యేలా చేస్తుంది.


 వైరల్ అవుతున్న వీడియో ప్రకారం చీమలు ఉన్న ప్రాంతంలోకి ఒక కొండచిలువ ప్రవేశించింది. నాకు బలం ఉంది. ఎవరు ఏం చేయలేరు అనే గర్వంతో ఆ కొండ చిలువ ముందుకు సాగింది. ఇలాంటి సమయంలోనే చీమలదండు కలిసికట్టుగా పోరాడింది. ఒక్కసారిగా కొండచిలువపై చీమలన్నీ కలిసి దాడి చేశాయి. పైనుండి కింది వరకు చీమలు మొత్తం కొండచిలువను చుట్టూముట్టయ్. ఈ చీమలను వదిలించుకోవడం కొండచిలువకు సాధ్యం కాలేదు. చివరికి ఆ చీమల దాడిలోనే కొండచిలువ ప్రాణాలు విడిచింది. ఇలా అత్యంత బలమైన కొండచిలువనే చీమలు చంపేయడం చాలామందిని ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ జీవిని తక్కువ అంచనా వేయకూడదు అని ఈ ఘటన ద్వారా ప్రకృతి అందరికీ అర్థమయ్యేలా ఒక సందేశం ఇస్తుందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
">
" style="height: 35px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>