MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr0d6aaaa5-19f5-416a-b2a3-7c98903f100d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr0d6aaaa5-19f5-416a-b2a3-7c98903f100d-415x250-IndiaHerald.jpg172 కోట్ల భారీ ఓపెనింగ్ వచ్చింది. ఇక తొలి మూడు రోజులు దూసుకెళ్లిన దేవర సోమవారం కాస్త తగిన మంగళవారం మళ్లీ పంజుకుంది. ఈరోజు గాంధీ జయంతి హాలిడే కావటంతో అక్కడక్కడ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఇక మరో రెండు రోజుల్లోనే అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్‌ సాధించి లాభాల బాట పట్ట‌ నుంది దేవర. NTR{#}NTR;House;Indian;Director;Telugu;Cinemaఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. రెడీగా ఉండండ‌మ్మ.. సక్సెస్ మీట్ ఎక్కడంటే..!ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. రెడీగా ఉండండ‌మ్మ.. సక్సెస్ మీట్ ఎక్కడంటే..!NTR{#}NTR;House;Indian;Director;Telugu;CinemaWed, 02 Oct 2024 15:41:00 GMTప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల‌తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ రావటం, పోటీలో  పెద్ద సినిమాలు ఏమీ లేకపోవటంతో తొలిరోజే రూ. 172 కోట్ల భారీ ఓపెనింగ్ వచ్చింది. ఇక తొలి మూడు  రోజులు దూసుకెళ్లిన దేవర సోమవారం కాస్త తగిన మంగళవారం మళ్లీ పంజుకుంది. ఈరోజు గాంధీ జయంతి హాలిడే కావటంతో అక్కడక్కడ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఇక మరో రెండు రోజుల్లోనే అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్‌ సాధించి లాభాల బాట పట్ట‌ నుంది దేవర.

దేవర సూపర్ హిట్ తో పాటు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. మ‌న‌ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. కల్కి సినిమా తర్వాత ఈ రేంజ్ హిట్ సినిమా పెద్ద సినిమా లేదు. దేవరతో మరోసారి థియేటర్లో కలకల్లాటడంతో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవటంతో ఫాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు . ఇక ఇప్పుడు అభిమానులకు మళ్లీ జోష్‌ని ఇచ్చేందుకు చిత్ర యూనిట్ భారీ స్థాయి లో సక్సెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది.

 ఎన్టీఆర్ కూడా అమెరికా టూర్ ముగించుకుని వచ్చేసాడు . ఇప్పటికి అయితే దేవర సక్సెస్ ఈ వెంట్ ను మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉండే గ్రౌండ్స్ లో నిర్వహించాలనే ఆలోచన ఉంది ఇదే గనుక నిజమైతే అభిమానుల తాకిడికి పల్నాడు మారుమోగటం ఖాయం . ఏపీలో ఈవెంట్ కు పర్మిషన్ కుదరకపోతే హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో చేయాలనే  ప్లాన్ కూడా చేస్తున్నారు .. ఇక త్వరలోనే దీనిపై అధికార ప్రక‌ట‌న‌ కూడా రానుంది . కాగా ఈవెంట్ కు అమెరికా పర్యటన కారణంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రాలేకపోవచ్చు అని కూడా అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>