EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokesh-cbn68e76489-7663-4a4a-9f14-df789f0af8d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokesh-cbn68e76489-7663-4a4a-9f14-df789f0af8d5-415x250-IndiaHerald.jpgనారా లోకేశ్ పై కీలక బాధ్యతలు పెట్టారు చంద్రబాబు. పార్టీలో ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. అటు ప్రభుత్వంలోను కూడా మంత్రిగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నవేళ లోకేశ్ సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉన్నందున వీలైనంతవరకు.. కూటమి పార్టీలతో సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పవన్ కల్యాణ్ తో పాటు జనసైనికులు సైతం సమన్వయం చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన దిల్లీ వెళ్లి పెద్దలను కూడా కలిశారు. అయితే ఇదంతా పక్కా వ్యూహంతో జరగుతున్నట్లు తెలుసlokesh cbn{#}mithra;Nara Lokesh;TDP;Party;YCP;Government;Pawan Kalyanలోకేశ్ కి స్టాలిన్ లా ప్రమోషన్ ఇచ్చిన బాబు? నెంబర్ టూ కోసమేనా?లోకేశ్ కి స్టాలిన్ లా ప్రమోషన్ ఇచ్చిన బాబు? నెంబర్ టూ కోసమేనా?lokesh cbn{#}mithra;Nara Lokesh;TDP;Party;YCP;Government;Pawan KalyanTue, 01 Oct 2024 12:30:00 GMTనారా లోకేశ్ పై కీలక బాధ్యతలు పెట్టారు చంద్రబాబు. పార్టీలో ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. అటు ప్రభుత్వంలోను కూడా మంత్రిగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నవేళ లోకేశ్ సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉన్నందున వీలైనంతవరకు.. కూటమి పార్టీలతో సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.


ఒకవైపు పవన్ కల్యాణ్ తో పాటు జనసైనికులు సైతం సమన్వయం చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన దిల్లీ వెళ్లి పెద్దలను కూడా కలిశారు. అయితే ఇదంతా పక్కా వ్యూహంతో జరగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు విషయంపై చర్చించడానికి లోకేశ్ దిల్లీ వెళ్లినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో పదవుల పంపకం విషయంలో కొన్ని రకాలు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని చర్చించేందుకు లోకేశ్ దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.


చంద్రబాబు నామినేటేడ్ పదవులు విషయంలో లోకేశ్ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఇటు రాష్ట్రంలో జనసేనతో, అటు జాతీయ స్థాయిలో దిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలో లోకేశ్ రాష్ట్ర  వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అప్పట్లో వైసీపీ దూకుడు మీద ఉండేది. టీడీపీ శ్రేణులు పై దాడులు కొనసాగేవి. పార్టీ నాయకులు చాలా ఇబ్బంది పడేవారు.  ఆ విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు లోకేశ్.


టీడీపీలో లోకేశ్ పట్టు పెరిగింది. సీనియర్లతో సైతం ఆయన చనువుగా ఉంటున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో జనసేనతో పాటు బీజేపీలో కూడా సమన్వయంతో కొనసాగుతున్నారు. పొత్తు అనేది సుదీర్ఘకాలం కొనసాగాలని భావిస్తున్న నేపథ్యంలో సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. సొంత పార్టీకి న్యాయం చేయడంతో పాటు మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేనతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరగా ఎటువంటి అరమరికలు లేకండా నామినేటేడ్ పదవులు పందేరం పూర్తి చేయాలన్న ఆలోచనలో లోకేశ్ ఉన్నారు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>