Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleba806767-416c-46d3-9f0d-5995b7e2bc2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleba806767-416c-46d3-9f0d-5995b7e2bc2a-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ వైరల్ అయి అంచనాలు భారీగా పెంచాయి. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా వాటిని ఇటీవల సుకుమార్, బన్నీ కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమా కోసం దర్శకుడు సుకుమార్ విపరీతంగా కష్టపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హెల్త్ కండిషన్ బాగా లేకపోయిన కూడా హాస్పిటల్ కి వెళ్లకుండా కేవలం టాబ్లsocialstars lifestyle{#}Ravi Shankar;Arjun;Jandhyala Ravishankar;Santosham;Darsakudu;November;Audience;Allu Arjun;December;Cinema;Director;Success;October;september;Newsసుకుమార్ ని టెన్షన్ పెడుతున్న పుష్ప 2 రష్.. తేడాకొడితే అంతే..!!సుకుమార్ ని టెన్షన్ పెడుతున్న పుష్ప 2 రష్.. తేడాకొడితే అంతే..!!socialstars lifestyle{#}Ravi Shankar;Arjun;Jandhyala Ravishankar;Santosham;Darsakudu;November;Audience;Allu Arjun;December;Cinema;Director;Success;October;september;NewsTue, 01 Oct 2024 12:00:00 GMTఅల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ వైరల్ అయి అంచనాలు భారీగా పెంచాయి. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా వాటిని ఇటీవల సుకుమార్, బన్నీ కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమా కోసం దర్శకుడు సుకుమార్ విపరీతంగా కష్టపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హెల్త్ కండిషన్ బాగా లేకపోయిన కూడా హాస్పిటల్ కి వెళ్లకుండా కేవలం టాబ్లెట్స్ ని మాత్రమే వేసుకుంటూ, షూటింగు లొకేషన్లో మాత్రమే గడుపుతున్నాడని టాక్ నడుస్తోంది. మరో పక్క అల్లు అర్జున్ కూడా ఎక్కడా రాజీ పడకుండా చేయవలసిన సీన్లనే పదే పదే చేస్తూ ఇంకా మెరిట్ రావాలనే ఉద్దేశంతో రిహార్సల్స్ మీద రిహార్సల్స్ పెడుతూ, చిత్ర యూనిట్ కి నరకం చూపుతున్నాడని టాక్ నడుస్తోంది.మొత్తానికైతే ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని గట్టిగా అనుకున్నట్టు కనబడుతోంది.

మరీ ముఖ్యంగా, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విషయంలో అల్లు అర్జున్ అస్సలు తగ్గడం లేదని తెలుస్తోంది. దాదాపు 2 నెలల నుండో ఆ ఒక్క ఫైట్ మాత్రమే చిత్రీకరిస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక దాంతో చిత్ర నిర్మాతలు కూడా చేయవలసిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారని టాక్ వినబడుతోంది. ఇక అన్నీ కుదిరి సినిమా హిట్ అయితే పర్వా లేదు గానీ, కాస్త తేడా కొడితే మాత్రం ఇక నిర్మాతలు గల్లంతయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమా అందరూ అనుకున్నట్టుగానే డిసెంబర్ 6నే జనాలు ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్ కష్టపడుతోంది.ఇదిలావుండగా తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో పుష్ప 2 అప్డేట్ అడగడంతో రవి శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వారానికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. నవంబర్ కి పూర్తి సినిమా మా చేతిలో పెడతారు. వినాయకచవితికి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమాలో ఇంకో రెండు పాటలు ఉన్నాయి. సెప్టెంబర్ చివర్లో ఒక సాంగ్, అక్టోబర్ లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తాము. నవంబర్ 20 నుంచి ఫుల్ గా పుష్ప ప్రమోషన్స్ చేస్తాము. పుష్ప 2 ప్రీమియర్స్ కూడా ఉంటాయి అని తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>