PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pm-modi3f7ef527-1659-42a5-87dc-32bbf5a20496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pm-modi3f7ef527-1659-42a5-87dc-32bbf5a20496-415x250-IndiaHerald.jpgతిరుమల శ్రీవారి లడ్డు పంచాయతీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. తిరుమల పంచాయతీ సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో... కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు.. అవాస్తవమని తేలిపోయింది. అసలు సిసలు ఆధారాలు లేకుండానే కూటమి ప్రభుత్వం...లడ్డు కల్తీ అయిందని... ఆరోపణలు చేసినట్లు సుప్రీంకోర్టు తేల్చేసింది. సోమవారం రోజున తిరుమల శ్రీవారి లడ్డు అంశం పైన సుప్రీంకోర్టు విచారణ చేసి.. సంచలన వ్యాఖ్యలు చేసింది. PM MODI{#}U Turn;monday;Janasena;Bharatiya Janata Party;Press;Ladoo;Telangana Chief Minister;kalyan;Tirupati;Government;Reddy;CBN;YCP;TDPలడ్డు వివాదం: సీన్ రివర్స్...పవన్, చంద్రబాబే దోషులు అంటున్న మోడీ ?లడ్డు వివాదం: సీన్ రివర్స్...పవన్, చంద్రబాబే దోషులు అంటున్న మోడీ ?PM MODI{#}U Turn;monday;Janasena;Bharatiya Janata Party;Press;Ladoo;Telangana Chief Minister;kalyan;Tirupati;Government;Reddy;CBN;YCP;TDPTue, 01 Oct 2024 14:38:00 GMTతిరుమల శ్రీవారి లడ్డు పంచాయతీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. తిరుమల పంచాయతీ సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో... కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు.. అవాస్తవమని తేలిపోయింది. అసలు సిసలు ఆధారాలు లేకుండానే కూటమి ప్రభుత్వం...లడ్డు కల్తీ అయిందని... ఆరోపణలు చేసినట్లు సుప్రీంకోర్టు తేల్చేసింది. సోమవారం రోజున తిరుమల శ్రీవారి లడ్డు అంశం పైన సుప్రీంకోర్టు విచారణ చేసి.. సంచలన వ్యాఖ్యలు చేసింది.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు ఇలా వ్యాఖ్యానించడం తప్పని పేర్కొంది. హిందూ ధర్మాన్ని కించపరిచేలా చంద్రబాబు నాయుడు.. తిరుమల లడ్డు కల్తీ అయిందని చెప్పడం దుర్మార్గం అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు పడడంతో... బిజెపి పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా బిజెపి వ్యవహరిస్తోంది.

 తిరుమల శ్రీవారి లడ్డు అంశం పైన పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే... ఆరోపణలు చేసినట్లుగా..  చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయినట్లు.. బిజెపి నేతలు బహిరంగంగా ఎక్కడ ప్రకటించలేదని అంశాన్ని కూడా... మోడీ అండ్ టీం వ్యవహరిస్తోంది. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి.. ఈ ముగ్గురు నేతలు అసలు సిసలు బిజెపి నేతలు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అంశం పైన ఈ ముగ్గురు నేతలు ఎక్కడా మాట్లాడలేదు.

 కేవలం టిడిపి నాయకులు అలాగే జనసేన నాయకులు మాత్రమే బహిరంగంగా ప్రెస్ మీట్ లు పెట్టి.. జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. అయితే ఇదే అంశాన్ని.. ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చి బిజెపి వ్యవహరిస్తోంది. లడ్డు కల్తీ అయిందనే వ్యాఖ్యలను బిజెపి ఎక్కడ కూడా వ్యాఖ్యానించలేదు. కేవలం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ను దోషులుగా... చూడాలని తమకు ఇలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది బిజెపి. ఈ విషయంలో చాలా సైలెంట్ గా కూడా ఉంటుంది. అటు వైసిపి కూడా... బిజెపిని కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ... కౌంటర్ ఇస్తోంది.నిన్నటి నుంచి చంద్రబాబు అలాగే పవన్ ను వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టి... ఒక ఆట ఆడుకుంటున్నారు వైసిపి నేతలు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>