MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-who-drowned-jhanvi-ram-charan-is-the-original6ebc6562-34aa-4b04-bda0-4257a1fd0b99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-who-drowned-jhanvi-ram-charan-is-the-original6ebc6562-34aa-4b04-bda0-4257a1fd0b99-415x250-IndiaHerald.jpgఇదే క్రమంలో గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వ‌చ్చిన దేవర పాన్ ఇండియా లెవెల్ లో రికార్డ్ కలెక్షన్లను అందుకుంటుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. Jhanvi KAPOOR{#}koratala siva;Darsakudu;Industry;NTR;Tollywood;Director;Telugu;Cinema;Indiaజాన్వీని అడ్డంగా ముంచిన దేవర.. రామ్ చరణ్ పైనే అసలు..!జాన్వీని అడ్డంగా ముంచిన దేవర.. రామ్ చరణ్ పైనే అసలు..!Jhanvi KAPOOR{#}koratala siva;Darsakudu;Industry;NTR;Tollywood;Director;Telugu;Cinema;IndiaMon, 30 Sep 2024 17:39:14 GMTఎన్టీఆర్, కొరటాల కాంబోలో వచ్చిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రికార్డులతో దూసుకుపోతుంది. ఇదే క్రమంలో గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వ‌చ్చిన దేవర పాన్ ఇండియా లెవెల్ లో రికార్డ్ కలెక్షన్లను అందుకుంటుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.


దివంగత అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలిసారిగా తెలుగు తెరపై కనిపించింది. ఈ సినిమాలో జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని.. క్యారెక్టరైజేషన్‌ సైతం సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం  జాన్వీని సినిమాలో అందాల ప్రదర్శనకే పరిమితం చేశారని టాక్‌ కూడా ఉంది. ఇండస్ట్రీకి వ‌చ్చిన‌  చాలా రోజులు తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం అది కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రావడంతో ఆమె పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని ఆమె అభిమానులు భావించిన వారికి నిరాశ ఎదురయింది. వాస్తవానికి ఒక్క చుట్టూ మల్లె పాటలో తప్పిస్తే మిగతా అంతా పది నిమిషాలు తప్పిస్తే మిగతా రన్‌ టైంలో జాన్వీ పాత్ర కనిపించలేదని కామెంట్స్‌ వస్తున్నాయి. సినిమాలో జాన్వీది గెస్ట్‌రోల్‌ కాదు కదా? అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై జాన్వీ కపూర్‌ సినిమాల్లో నటించే ముందు పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇక జాన్వీ కపూర్‌ పాత్రకు దేవర-2లోనైనా ప్రాధాన్యం ఉంటుందా? లేదా? వేచి చూడాల్సిందే. త్వరలోనే జాన్వీ కపూర్‌ ‘ఉప్పెన’ ఫేమ్‌ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా మూవీ తెరకెక్కనున్నది. ఈ మూవీలో జాన్వీ కపూర్‌ నటించనున్నది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానున్నది. దేవరలో జాన్వీకి పెద్దగా స్క్రీన్‌ టైమ్‌ దొరకలేదు. ఉన్న సీన్స్‌లో నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. ఈ క్రమంలో రామ్‌ చరణ్‌ మూవీలోనైనా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర నటించాలని జాన్వీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మరి దర్శకుడు బుచ్చిబాబు జాన్విని ఏ విధంగా చూపిస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>