PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-janasenaf631e56e-b56f-4181-9d8e-0460d70015ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-janasenaf631e56e-b56f-4181-9d8e-0460d70015ec-415x250-IndiaHerald.jpgఅయితే ఏ ఎన్నికలలోను నాగబాబు నర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే బిజెపితో పొత్తులో నరసాపురం సీటులో పోటీ చేయటం కుదరలేదు. చివరకు అనకాపల్లి నుంచి అయినా లోక్సభ పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే బిజెపి నేత సీఎం రమేష్ కోసం నాగబాబు తన సీటు త్యాగం చేయక తప్పని పరిస్థితి. Janasena{#}Bharatiya Janata Party;Deputy Chief Minister;Parliment;narasapuram;Janasena;Nagababu;CBN;MP;central government;CM;Minister;kalyan;Chiranjeeviజ‌న‌సేన కేంద్ర మంత్రిగా ఆయ‌న ఫిక్స్ ..?జ‌న‌సేన కేంద్ర మంత్రిగా ఆయ‌న ఫిక్స్ ..?Janasena{#}Bharatiya Janata Party;Deputy Chief Minister;Parliment;narasapuram;Janasena;Nagababu;CBN;MP;central government;CM;Minister;kalyan;ChiranjeeviMon, 30 Sep 2024 09:08:28 GMTమెగా ఫ్యామిలీ లో మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ పంట పండుతున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. నాగబాబు రాజకీయ జీవితం సరికొత్త మలుపులు తిరగబోతుంది. వాస్తవంగా నాగబాబు 2019 సాధారణ ఎన్నికలలో తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన నరసాపురం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. మూడోస్థానంతో సరిపెట్టుకున్న నాగబాబు గణనీయంగా ఓట్లు సాధించారు. అయితే ఏ ఎన్నికలలోను నాగబాబు నర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే బిజెపితో పొత్తులో నరసాపురం సీటులో పోటీ చేయటం కుదరలేదు. చివరకు అనకాపల్లి నుంచి అయినా లోక్సభ పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే బిజెపి నేత సీఎం రమేష్ కోసం నాగబాబు తన సీటు త్యాగం చేయక తప్పని పరిస్థితి.


అయితే నాగబాబు కు ఇప్పుడు రాజకీయంగా అదృష్టం మెయిన్ డోర్ త‌ట్టబోతోంది. వైసీపీ నుంచి కృష్ణయ్య తన రాజ్యసభ పదవితో పాటు వైసిపికి అనూహ్యంగా రాజీనామా చేయటం అలా మూడో ఎంపీ సీట్లు కూడా ఖాళీ కావడంతో నాగబాబుకు లక్‌ చిక్కింది. కృష్ణయ్య తన నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలం వదులుకున్నారు. దీంతో పెద్దల సభలో నాలుగేళ్ల పదవీకాలం అంటే అది బంగారు పళ్లెంతో సమానం అని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఇద్దరు రాజ్యసభ వైసిపి ఎంపీలు రాజీనామా చేశారు. ఆ రెండు ఎంపీ సీట్లలో టిడిపి వారిని ఎంపిక చేయాలని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కృష్ణయ్య రాజ్యసభ పదవి ఖాళీ కావడంతో దానిని జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.


ఈ క్రమంలోని జనసేన నుంచి నాగబాబు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారు. అదేకనుక‌ జరిగితే నాగబాబుకు జనసేన కోటాలో కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా వస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే క‌నుక జ‌రిగితే మెగా ఫ్యామిలీలో చిరంజీవి కేంద్ర మంత్రి ... ఇక ఇప్పుడు ప‌వ‌న్ కళ్యాణ్ ఏపీ మంత్రి .. డిప్యూటీ సీఎం గా ఉండ‌డం.. నాగ‌బాబు కూడా కేంద్రం మంత్రి కావ‌డం... ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు అన్న‌ద‌మ్ములు మంత్రులు అయిన రికార్డ్ సాధించిన‌ట్ల‌వుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>