PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brsb294bb95-b868-4140-89b3-f1dacf72e888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brsb294bb95-b868-4140-89b3-f1dacf72e888-415x250-IndiaHerald.jpg తెలంగాణలో గత డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అనూహ్యంగా నాలుగు నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు. కాంగ్రెస్ - బిజెపి చెరి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. ఆ దూకుడు కంటిన్యూ చేసుకునేందుకు బిజెపికి మంచి అవకాశం కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆ అవకాశాన్ని అందిపుచ్చు కోవడంలో బిజెపి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ? అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. brs{#}KCR;revanth;Telangana;Car;Parliament;MP;Partyఫామ్‌లోకి వ‌చ్చేసిన బీఆర్ఎస్‌... వెన‌క‌ప‌డిపోయిన బీజేపీ..?ఫామ్‌లోకి వ‌చ్చేసిన బీఆర్ఎస్‌... వెన‌క‌ప‌డిపోయిన బీజేపీ..?brs{#}KCR;revanth;Telangana;Car;Parliament;MP;PartyMon, 30 Sep 2024 08:06:00 GMT- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

వ‌రుస‌ ఎన్నికల ఓటములతో చేరుకుని బిఆర్ఎస్ తిరిగి ఫామ్ లోకి వస్తుంటే ... ఈ రెండు ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలను సాధించిన బిజెపి మాత్రం ఆ దూకుడు కొనసాగించలేకపోతోంది. తెలంగాణలో గత డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అనూహ్యంగా నాలుగు నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు. కాంగ్రెస్ - బిజెపి చెరి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. ఆ దూకుడు కంటిన్యూ చేసుకునేందుకు బిజెపికి మంచి అవకాశం కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆ అవకాశాన్ని అందిపుచ్చు కోవడంలో బిజెపి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ? అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి.


అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికలలో 8 నియోజకవర్గాలలో డిపాజిట్ గల్లంత కావడంతో బిఆర్ఎస్ భవిష్యత్తుపై నీలినడలు క‌మ్ముకున్నాయి. కారు పంక్చ‌ర్ అయిందని ఇప్పటిలో కారు పరుగులు పెట్టడం సాధ్యం కాదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కారు దిగి కాంగ్రెస్ కావడం తీర్థం ఇచ్చుకున్నారు. దీనికి తోడు కేసీఆర్ పూర్తిగా పాముహౌస్కే పరిమితం కావడంతో గులాబీ శ్రేణులు మానసిక స్థైర్యం ని కోల్పోయాయి. పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాలు ఆ సమయంలో పిఎసి చైర్మన్గా అరికెపూడి గాంధీని నియమించడంతో బీఆర్ఎస్ ఉద్యమ సమయం నాటి రాజకీయం చేయాలని సంకల్పించింది.


ఇక వరదల భారీ వ‌ర‌ద‌ల నుంచి హైదరాబాద్‌ను కాపాడేందుకు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా పై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. హైడ్రా పేరుతో ... మూసి సుందరీకరణలో భాగంగా పేదల నివాసాలు కూల్చుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బలమైన స్వరం వినిపిస్తున్న గ్రేటర్లో బలమైన కార్పొరేటర్లు ఉన్న బిజెపి మాత్రం అగ్రేసివ్ గా స్పందించడం లేదు. ఏది ఏమైనా తెలంగాణ బిజెపిలో ఉన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో సమిష్టి పోరాటం చేయడం లేదు. అందుకే బిఆర్ఎస్ మళ్ళి తిరిగి ఫామ్ లోకి వస్తే.. బిజెపి 8 ఎంపీ స్థానాలు ఉండి కూడా పడుతూ లేస్తున్న పరిస్థితి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>