MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil6d8ac491-19a7-4246-a971-2e8c67efc314-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil6d8ac491-19a7-4246-a971-2e8c67efc314-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో నిఖిల్ ఒకరు. పక్కింటి కుర్రాడిలా కనిపించే నిఖిల్ హ్యపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన రేంజ్ ను పెంచుకున్నారు. అయితే ఈ హీరో తొలి సినిమా హ్యాపీడేస్ కాదనే విషయం చాలామందికి తెలియదు. సంబరం, హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాలలో చిన్న పాత్రలతో నిఖిల్ కెరీర్ మొదలైంది. nikhil{#}karthikeya;kartikeya;Nijam;Happy days;Ekkadiki Pothavu Chinnavada;Hyderabad;Success;Hero;Tollywood;India;Cinemaబ్యాక్ గ్రౌండ్ లేకున్నా బాక్సాఫీస్ ను షేక్ చేసిన నిఖిల్.. ఈ పక్కింటి కుర్రాడికి క్రేజ్ ఎక్కువే!బ్యాక్ గ్రౌండ్ లేకున్నా బాక్సాఫీస్ ను షేక్ చేసిన నిఖిల్.. ఈ పక్కింటి కుర్రాడికి క్రేజ్ ఎక్కువే!nikhil{#}karthikeya;kartikeya;Nijam;Happy days;Ekkadiki Pothavu Chinnavada;Hyderabad;Success;Hero;Tollywood;India;CinemaMon, 30 Sep 2024 08:55:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో నిఖిల్ ఒకరు. పక్కింటి కుర్రాడిలా కనిపించే నిఖిల్ హ్యపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన రేంజ్ ను పెంచుకున్నారు. అయితే ఈ హీరో తొలి సినిమా హ్యాపీడేస్ కాదనే విషయం చాలామందికి తెలియదు. సంబరం, హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాలలో చిన్న పాత్రలతో నిఖిల్ కెరీర్ మొదలైంది.
 
అయితే ఈ సినిమాలతో నిఖిల్ కు నటుడిగా ఆశించిన రేంజ్ లో గుర్తింపు అయితే రాలేదు. హ్యాపీడేస్ సినిమాలో హీరోలలో ఒకడిగా నటించిన నిఖిల్ తన మార్క్ నటనతో ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత నిఖిల్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే చెప్పాలి. స్వామిరారా, కార్తికేయ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్న నిఖిల్ ఈ సినిమాలతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
 
మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా ఎక్కడికి పోతావు చిన్నవాడా నిఖిల్ కు భారీ విజయాన్ని అందించింది. కార్తికేయ2 సినిమాతో నిఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో పాటు 18 పేజెస్ సినిమాతో సత్తా చాటారు. స్పై సినిమా నిరాశ పరిచినా నిఖిల్ తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. నిఖిల్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే.
 
నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ అనే సినిమాలో నటిస్తుండగా పాన్ ఇండియా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిఖిల్ కు మరో భారీ విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. నిఖిల్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటం గమనార్హం. సోషల్ మీడియాలో సైతం నిఖిల్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. నిఖిల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>