PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpab5d853a-c313-4355-8aec-d92aa3182540-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpab5d853a-c313-4355-8aec-d92aa3182540-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఏకంగా ముగ్గురు ఎంపీలు బయటకు వచ్చేసారు. మోపిదేవి వెంకటరమణ - బీదా మస్తాన్రావు - ఆర్ . కృష్ణయ్య వైసీపీతో పాటు పదవులకు కూడా రాజీనామాలు చేసేశారు. పైగా కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్ గా ఉండడంతో వైసీపీకి బిజెపితో దోస్తీ చేసే అవకాశం సందు కూడా దొరకటం లేదు. దీంతో వైసిపికి సీన్ అర్థమైపోయింది .. టిడిపి - జనసేనతో పాటు బిజెపిని కూడా శత్రుపార్టీల జాబితాలో చేర్చినట్టే కనిపిస్తోంది. ycp{#}madhavi latha;Jagan;Andhra Pradesh;Mopidevi Venkata Ramana;YCP;politicsవైసీపీకి ప్లాప్ సినిమా అర్థ‌మైంది... మోడీ టార్గెట్ వెన‌క క‌థ ఇదా..?వైసీపీకి ప్లాప్ సినిమా అర్థ‌మైంది... మోడీ టార్గెట్ వెన‌క క‌థ ఇదా..?ycp{#}madhavi latha;Jagan;Andhra Pradesh;Mopidevi Venkata Ramana;YCP;politicsMon, 30 Sep 2024 08:12:38 GMTసాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోతే ఏమవుతుంది ... రాజ్యసభలో ఉన్న బలంతో బిజెపిని తమకు అనుకూలంగా మార్చుకుంటాం అని కలలు కన్న వైసిపి పప్పులు ఉడకటం లేదు. రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు వైసీపీని వీడి వెళుతున్నారు. ఇప్పటికే ఏకంగా ముగ్గురు ఎంపీలు బయటకు వచ్చేసారు. మోపిదేవి వెంకటరమణ - బీదా మస్తాన్రావు - ఆర్ . కృష్ణయ్య వైసీపీతో పాటు పదవులకు కూడా రాజీనామాలు చేసేశారు. పైగా కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్ గా ఉండడంతో వైసీపీకి బిజెపితో దోస్తీ చేసే అవకాశం సందు కూడా దొరకటం లేదు. దీంతో వైసిపికి సీన్ అర్థమైపోయింది .. టిడిపి - జనసేనతో పాటు బిజెపిని కూడా శత్రుపార్టీల జాబితాలో చేర్చినట్టే కనిపిస్తోంది.


తాజాగా తిరుమల లడ్డు వివాదం పై వైఎస్ జగన్ తో పాటు వైసిపి నేతలపై హైదరాబాద్కు చెందిన బిజెపి మహిళ నేత మాధవి లత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉండేవారికి ఆంధ్ర రాజకీయాలు ఎందుకని ? ప్రశ్నించిన నాని హిందువులపై అమితమైన ప్రేమ ఒల‌క‌ పోస్తున్న తాను  ... తన ఆసుపత్రిలో హిందువులకు బిల్లులు తగ్గించారా అని నిలదీశారు. గతంలో అన్య మతస్తుడు అయిన ఏపీ గవర్నర్ ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని అప్పుడు బిజెపి నేతలు ఎందుకు ఆయనను ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. అన్య‌మ‌త‌స్తుడు అని మతస్తుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఎందుకు తీసుకువెళ్లారని మోడీని ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు పేర్ని నాని.


తాజాగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో బీజేపీని వైసిపి నేరుగా టార్గెట్ చేసినట్టు క్లియర్గా అర్థం అవుతుంది. తిరుమల లడ్డు విషయంలో గత కొద్ది రోజులుగా బిజెపి నేతల ప్రాప‌కం కోసం తెగ ప్రయత్నించి విఫలం అయింది వైసిపి. ఇక ఆ పార్టీ నుంచి తమకు ఎలాంటి సహకారం దొర‌క‌దని ఫిక్స్ అయ్యారో ఏమోగానీ ఇప్పుడు ప్రధానిని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం చర్చనీయాంశం అవుతుంది. బిజెపిని ప్రశ్నించడం ద్వారా జాతీయ స్థాయిలో మరికొన్ని పార్టీల మద్దతు అయినా తమకు లభిస్తుందన్న ఆశలతో ఈ విషయంలో మోడీని సైతం వైసీపీ టార్గెట్ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>