Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-sachind1404b0d-f840-4cf4-981a-3c7d008f2f24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-sachind1404b0d-f840-4cf4-981a-3c7d008f2f24-415x250-IndiaHerald.jpgక్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన జీవితం అంతా క్రికెట్ కే అంకితం ఇచ్చిన టెండూల్కర్ భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు..అన్ని దేశాలలో గొప్ప బ్యాట్స్మెన్ ల అందరికి సచిన్ అంటే ఎంతో గౌరవం ఆయనను స్ఫూర్తిగా తీసుకోని వారు తమ కెరీర్ లో రానిస్తూ వుంటారు.. సచిన్ తన 11 ఏళ్ల వయసు లో మొదటిసారి బ్యాట్ పట్టారు.. 14 ఏళ్ల వయస్సులో, అతను తన పాఠశాల మ్యాచ్‌లో 664 ప్రపంచ రికార్డ్ స్టాండ్‌లో 329 స్కోర్ చేయడానికి దానిని ఉపయోగించాడు. అతను బాంబే తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే స#sachin{#}Sachin Tendulkar;Mumbai;Cricket;Hanu Raghavapudi;Government;School;World Cup;INTERNATIONAL;Indian;India;Parliment;Rajya Sabhaమురిపించి మరిపించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రాజకీయ జీవితం..!!మురిపించి మరిపించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రాజకీయ జీవితం..!!#sachin{#}Sachin Tendulkar;Mumbai;Cricket;Hanu Raghavapudi;Government;School;World Cup;INTERNATIONAL;Indian;India;Parliment;Rajya SabhaSun, 29 Sep 2024 08:22:23 GMT


*  క్రికెట్ గాడ్ గా సచిన్ అంతర్జాతీయంగా గుర్తింపు
 
*  ఎన్నో రికార్డ్స్, ఎన్నో రివార్డ్స్ ఆగని ప్రవాహంలా సచిన్ రికార్థుల పరంపర

*  భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అందుకున్న మొదటి క్రీడాకారుడు..


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన జీవితం అంతా క్రికెట్ కే అంకితం ఇచ్చిన టెండూల్కర్ భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు..అన్ని దేశాలలో గొప్ప బ్యాట్స్మెన్ ల అందరికి సచిన్ అంటే ఎంతో గౌరవం ఆయనను స్ఫూర్తిగా తీసుకోని వారు తమ కెరీర్ లో రానిస్తూ వుంటారు.. సచిన్ తన 11 ఏళ్ల వయసు లో మొదటిసారి బ్యాట్ పట్టారు.. 14 ఏళ్ల వయస్సులో, అతను తన పాఠశాల మ్యాచ్‌లో 664 ప్రపంచ రికార్డ్ స్టాండ్‌లో 329 స్కోర్ చేయడానికి దానిని ఉపయోగించాడు. అతను బాంబే తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. సచిన్ 16 సంవత్సరాల వయస్సులో అతను భారతదేశపు అతి పిన్న వయస్కుడైన టెస్ట్ (అంతర్జాతీయ) క్రికెటర్ అయ్యారు..నవంబర్ 1989లో కరాచీలో పాకిస్తాన్‌పై సచిన్ అరంగేట్రం చేశారు.23 సంవత్సరాల వయసులో భారత దేశ జట్టుకు కెప్టెన్ గా నియమించబడ్డారు.సచిన్ తన కెరీర్ లో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నారు. టెండూల్కర్ 2007 లో వన్డే అంతర్జాతీయ (ODI) ఆటలో ఏకంగా 15,000 పరుగులు నమోదు చేసిన మొదటి ఆటగాడిగా సచిన్ నిలిచాడు.. అలాగే 2011లో టెస్ట్ ఆటలో కూడా ఏకంగా 15,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్ గా సచిన్ రికార్డ్ క్రియేట్ చేసారు. అలాగే దక్షిణాఫ్రికా జట్టుపై ఏకంగా డబుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించారు.


సచిన్ 2012 లో బాంగ్లాదేశ్ తో జరిగిన ODI మ్యాచ్ లో తన 100 సెంచరీ పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు.. 2011 ఇండియా అంతర్జాతీయ వన్ డే వరల్డ్ కప్ సాధించింది.. ఈ కప్ ను ఇండియా టీం సచిన్ కు అంకితం ఇచ్చింది..ఇండియా వరల్డ్ కప్ గెలవడంతో ఆ ఆనందంలో సచిన్ వన్ డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు..ఇండియన్ క్రికెట్ టీంలో సచిన్ అందించిన సేవలకు గాను అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ భారత పార్లమెంట్ సభ్యుడిగా నామినేట్ చేసారు. సచిన్ 2012 లో భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ సభ్యుడిగా మారారు.. సచిన్ ఇండియన్ క్రికెట్ లో అందించిన సేవలకు గాను అప్పటి భారత ప్రభుత్వం 2014 లో సచిన్ కు అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించింది..భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్న మొదటి క్రీడాకారుడుగా సచిన్ నిలిచారు. రాజ్యసభ సభ్యుడిగా సచిన్ పదవీ కాలం 2018 లో ముగిసింది.. కానీ ఆ తరువాత తాను ఏ రాజకీయ పార్టీలో చేరదల్చుకోవటం లేదని సచిన్ ప్రకటించారు..ఆ తరువాత సచిన్ 2019 లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>