Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devera072b73e7-8a46-4306-a983-0a5b6fe2fb06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devera072b73e7-8a46-4306-a983-0a5b6fe2fb06-415x250-IndiaHerald.jpgభారీ అంచనాల నడుమ విడుదలైన "దేవర" సినిమా మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కళ్ళు చెదిరే రీతిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. డే 1 కలెక్షన్స్ రూ.172 కోట్లు రావడంతో మూవీ మేకర్స్ చాలా ఊపిరి పీల్చుకున్నారు. జూ.ఎన్టీఆర్ ఊర మాస్‌గా నటించిన ఈ సినిమా చూసేందుకు ప్రజలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. 23 ఏళ్లుగా రాజమౌళి సినిమా తీసాక ఎవరైనా సరే ఫ్లాప్ అందుకోవాలని ఒక సెంటిమెంటు వినిపిస్తూ వచ్చింది. దాన్ని ఎన్టీఆర్ తుడిచిపెట్టేశాడు. ఈ సినిమా మంచిగానే పర్ఫార్మ్ చేస్తుంది ఇందులో ఎన్టీఆర్ బdevera{#}Jr NTR;koratala siva;Rajamouli;NTR;Cinema;mediaదేవరలో రెండు పేజీల డైలాగ్.. జాన్వీ ఎప్పుడు చెప్పిందబ్బా..?దేవరలో రెండు పేజీల డైలాగ్.. జాన్వీ ఎప్పుడు చెప్పిందబ్బా..?devera{#}Jr NTR;koratala siva;Rajamouli;NTR;Cinema;mediaSun, 29 Sep 2024 12:35:00 GMTభారీ అంచనాల నడుమ విడుదలైన "దేవర" సినిమా మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కళ్ళు చెదిరే రీతిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. డే 1 కలెక్షన్స్ రూ.172 కోట్లు రావడంతో మూవీ మేకర్స్ చాలా ఊపిరి పీల్చుకున్నారు. జూ.ఎన్టీఆర్ ఊర మాస్‌గా నటించిన ఈ సినిమా చూసేందుకు ప్రజలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. 23 ఏళ్లుగా రాజమౌళి సినిమా తీసాక ఎవరైనా సరే ఫ్లాప్ అందుకోవాలని ఒక సెంటిమెంటు వినిపిస్తూ వచ్చింది. దాన్ని ఎన్టీఆర్ తుడిచిపెట్టేశాడు. ఈ సినిమా మంచిగానే పర్ఫార్మ్ చేస్తుంది ఇందులో ఎన్టీఆర్ బాగానే నడిపించాడు. కానీ దేవరపై ట్రోల్స్ ఆగడం లేదు ట్రైలర్ రిలీజ్ అయిన సమయం నుంచి ఈ ట్రోల్స్ మొదలయ్యాయి.

 సినిమా విడుదలైన తర్వాత ట్రోల్స్ ఎక్కువయ్యాయి. దేవరను సింగిల్ పార్టీగా తీస్తే బాగుండేదని, దేవర క్లైమాక్స్ చూసాక ఇక దానికి మరొక ఎండింగ్ అవసరం లేదని అనిపించిందని చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్ట్ 2లో ఏం కథ చెప్పడానికి కొరటాల శివ సిద్ధమయ్యారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్‌‌ పాత్ర గురించి కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ పాత్ర గురించి బాగా ఎలివేట్ చేశాడు తీరా సినిమా చూస్తే ఆమె పాత్ర తుస్సుమనిపించింది.

దేవర మూవీ ప్రమోషన్స్‌ సమయంలో తారక్ మాట్లాడుతూ జాన్వీ కపూర్ రోల్ అద్భుతంగా ఉంటుందని అన్నాడు. దేవరలో ఆమె యాక్టింగ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని గొప్పలు చెప్పాడు. అంతేకాదు ఆమె కోసం కొరటాల 2 పేజీల డైలాగ్ రాశాడని అది వింటే గూస్ బంప్స్‌ వస్తాయని తెలిపాడు. ఎన్టీఆర్ అలాంటి కామెంట్లు చేశాక జాన్వీ యాక్టింగ్ ఇరగేసిందేమో అని చాలామంది అనుకున్నారు అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్లకి వెళ్లారు. కానీ వారు అనుకున్నట్టు జాన్వీ రెండు పేజీల డైలాగ్ ఎక్కడా కనిపించలేదు. దీంతో  ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.

జాన్వీని కేవలం అందాల ఆరబోత కోసం, గ్లామర్ ట్రీట్ కోసమే తీసుకున్నారు. ఆమెకు మొత్తం కలిపే రెండు పేజీల డైలాగులు కూడా లేవు రెండు మూడు డైలాగులు చెప్తుంది అంతే. అందుకే ఎన్టీఆర్ ను సోషల్ మీడియా యూజర్లు బాగా విమర్శిస్తున్నారు. కొరటాల శివని కూడా తిట్టిపోస్తున్నారు.

" style="height: 35px;">


 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>