PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/yusuf-pathan-indian-cricketer-tmc-west-bengal3b3bfb33-543a-4243-91ba-c89a28b618d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/yusuf-pathan-indian-cricketer-tmc-west-bengal3b3bfb33-543a-4243-91ba-c89a28b618d2-415x250-IndiaHerald.jpg యూసఫ్ పఠాన్ గుజరాత్ లోని బరోడాలో 1982 నవంబర్ 17న పఠాన్ ఫ్యామిలీలో జన్మించాడు. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే పఠాన్ గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఎన్నో రికార్డులు సాధించాడు. ఈయన 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్ ద్వారా అరంగేట్రం చేసి 57 వన్డేల్లో 810 పరుగులు, 22 టీ 20ల్లో 232 పరుగులు చేశాడు. ముఖ్యంగా వన్డేలో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు చేసిన యూసఫ్ పఠాన్ 2012 తర్వాత మళ్లీ టీమ్ ఇండియా జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈయన ఐపీఎల్ లో 2008 రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్YUSUF PATHAN; INDIAN CRICKETER; TMC; WEST BENGAL{#}Gujarat - Gandhinagar;Rajasthan;West Bengal - Kolkata;Adhir Ranjan Chowdhury;Pune;NTR;November;INTERNATIONAL;Congress;Party;Success;India;Cricketయూసఫ్ పఠాన్: క్రికెట్ లో రికార్డుల వీరుడు.. రాజకీయాల్లో సక్సెస్ అయిన ధీరుడు..!!యూసఫ్ పఠాన్: క్రికెట్ లో రికార్డుల వీరుడు.. రాజకీయాల్లో సక్సెస్ అయిన ధీరుడు..!!YUSUF PATHAN; INDIAN CRICKETER; TMC; WEST BENGAL{#}Gujarat - Gandhinagar;Rajasthan;West Bengal - Kolkata;Adhir Ranjan Chowdhury;Pune;NTR;November;INTERNATIONAL;Congress;Party;Success;India;CricketSun, 29 Sep 2024 09:33:00 GMT -గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ వరకు..
- క్రికెట్ లో రికార్డుల రారాజు..
- రాజకీయాల్లో కూడా అదరగొట్టాడు..


 మన ఇండియాలో ఎక్కువగా సినిమాల నుంచి  రాజకీయాల్లోకి  వస్తుంటారు. ఇక సినిమావాళ్ళే కాకుండా ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యం సాధించి రికార్డులు క్రియేట్ చేసిన వారు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారు.  సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారిలో సీనియర్ ఎన్టీఆర్  అగ్రగణ్యుడు. అలా క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి సక్సెస్ అయిన వారిలో మహమ్మద్ అజారుద్దీన్ కూడా ఒకరు..  అయితే ఆయన బాటలోనే మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కూడా  రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి మొదటిసారి విజయం సాధించారు. టీఎంసీ పార్టీ తరఫున పోటీ చేసి అద్భుతమైనటువంటి  విజయాన్ని కైవసం చేసుకున్నారు. మరి యూసఫ్ పఠాన్ రాజకీయ  మరియు క్రికెట్ రికార్డుల గురించి కొన్ని వివరాలు చూద్దాం..

 యూసఫ్ పఠాన్ గుజరాత్ లోని  బరోడాలో 1982 నవంబర్ 17న పఠాన్ ఫ్యామిలీలో జన్మించాడు. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే పఠాన్  గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఎన్నో రికార్డులు సాధించాడు. ఈయన 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్ ద్వారా  అరంగేట్రం చేసి 57 వన్డేల్లో 810 పరుగులు, 22 టీ 20ల్లో 232 పరుగులు చేశాడు. ముఖ్యంగా వన్డేలో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు చేసిన యూసఫ్ పఠాన్  2012 తర్వాత మళ్లీ టీమ్ ఇండియా జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈయన ఐపీఎల్ లో 2008 రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి  435 పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఎనిమిది వికెట్లు తీసి ఆ ఏడాది రాజస్థాన్ టైటిల్ గెలుచుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారని చెప్పవచ్చు. ఇక దీని తర్వాత ఆయన  అనేక సీజన్స్లో కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పూణే వారియర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించి  మంచి ప్రతిభను కనబరిచేలా చేశారు. ఇక చివరిగా 2018లో  ఐపీఎల్ లో ఆడారు.  ఇక తర్వాత 2021లో అంతర్జాతీయ క్రికెట్ కు ఆయన స్వస్తి పలికారు.

 రాజకీయ జీవితం:
 యూసఫ్ పటాన్ 2024లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి  తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి అధీర్ రంజన్ చౌదరి పై పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో యూసఫ్ పఠాన్  అద్భుతమైన విజయాన్ని సాధించాడు. సమీప ప్రత్యర్థి అధీర్ రంజన్ చౌదరిని ఓడించి  మొత్తం 5,24,516 ఓట్లను సాధించాడు. ఈ విధంగా క్రికెట్లో ఎంతో పేరు తెచ్చుకున్న యూసఫ్ పఠాన్ రాజకీయాల్లో కూడా అరంగేట్రం చేసి  మొదటిసారి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>