LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/parents-fight-children-front--future--jeopardyba31485c-cda9-4809-9c60-75a331d87448-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/parents-fight-children-front--future--jeopardyba31485c-cda9-4809-9c60-75a331d87448-415x250-IndiaHerald.jpgపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అసలు గొడవ పడకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు గొడవ పడటం వల్ల చిన్న పిల్లలు చిన్న పుచ్చుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లలు ఉన్నప్పుడు గొడవలు పడకండి. పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడటం వారి మానసిక, భావోద్వేగా పరిస్థితులపై ఎఫెక్ట్ చూపుతుంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. భార్యాభర్తల మధ్య భిన్నభిప్రాయాలు ఉండటం సహజమే కానీ అలాగని పిల్లల ముందు వాదనకు దిగటం సముచితం కాదని అంటున్నారు. అలా చేయటం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో వివరిస్తున్నారు. పిల్లలు వాదనను పూర్తిగా అర్థంParents fight; children; front ; future ; jeopardy{#}Parentsపిల్లల ముందు తల్లిదండ్రుల గొడవలు.. పిల్లల భవిష్యత్తు ఆగం..!పిల్లల ముందు తల్లిదండ్రుల గొడవలు.. పిల్లల భవిష్యత్తు ఆగం..!Parents fight; children; front ; future ; jeopardy{#}ParentsSun, 29 Sep 2024 11:54:00 GMTపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అసలు గొడవ పడకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు గొడవ పడటం వల్ల చిన్న పిల్లలు చిన్న పుచ్చుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లలు ఉన్నప్పుడు గొడవలు పడకండి. పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడటం వారి మానసిక, భావోద్వేగా పరిస్థితులపై ఎఫెక్ట్ చూపుతుంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. భార్యాభర్తల మధ్య భిన్నభిప్రాయాలు ఉండటం సహజమే కానీ అలాగని పిల్లల ముందు వాదనకు దిగటం సముచితం కాదని అంటున్నారు. అలా చేయటం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో వివరిస్తున్నారు.

 పిల్లలు వాదనను పూర్తిగా అర్థం చేసుకోలేక పోయినా... ఆ సమయంలో తలెత్తే ఉద్రిక్తత, సంఘర్షణకు సున్నితంగా ఉంటారు. ఇలాంటివి చూడటం ఆందోళన, భయం, విచారం కలిగిస్తాయి. ఆ వాతావరణం అసురక్షతంగా భావిస్తారు. తల్లిదండ్రులు గొడవ పడటం చూసిన పిల్లలు ఒకరు లేదా ఇద్దరు పేరెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయటం ప్రారంభించవచ్చు. వారిపై గౌరవం తగ్గవచ్చు. వైరుధ్యాల మధ్యలో చిక్కుకున్నట్టు ఫిల్ అయ్యే చిన్నారులు... భావోద్వేగా ఒత్తిడికి గురవుతారు. ఈ పరిస్థితి కుటుంబంలో బంధాల విచ్చిన్నానికి దారితీస్తుంది.

చిన్నారులు తల్లిదండ్రుల వాదనను ఉదాహరణగా తీసుకునే అవకాశం ఉంది. తమ బంధులలోనూ ఇదే పరిస్థితిని పాటించే ఛాన్స్ ఉంటుంది. వారి మానసిక అభివృద్ధికి ఆటంకం కలిగించే సమస్యలను పరిష్కరించేందుకు కేకలు వేయటం, గొడవ పడటం చేస్తుంటారు. ఇది వారిని నెగిటివ్ గా చూపించే ప్రమాదం ఉంది. వాదించటం తరచుగా పిల్లల అవసరాలు, ఆందోళనల నుంచి దృష్టిని మారుస్తుంది. వారు నిర్లక్ష్యం చేయబడినట్లు భావించవచ్చు. కాలక్రమేణా వారి మానసిక శ్రేయస్సు, తల్లిదండ్రులతో బంధం ప్రభావితం అవుతుంది. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అసలు గొడవ పడకండి. మీరే గొడవ పడటం చూసిన వారు బయట పిల్లలతో గొడవ పడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కలిసి మెలిసి ఉండటం ఉత్తమం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>