PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/duput-cm-pawankalyan-cm-post-comments-virale653c075-cc34-4ef9-8f09-54633c71504b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/duput-cm-pawankalyan-cm-post-comments-virale653c075-cc34-4ef9-8f09-54633c71504b-415x250-IndiaHerald.jpgజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో తన పార్టీ నుంచి నిలబడిన ప్రతిచోట కూడా గెలవడం జరిగింది..21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేయక అన్నిచోట్ల భారీ స్థాయిలోనే రికార్డుగా గెలిచారు పవన్ కళ్యాణ్ దీంతో కూటమిలో భాగంగా ఈయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎంపీ ఎమ్మెల్యేలకు పలు కీలకమైన పదవులను ఇచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు సైతం సగం కల నెరవేరింది అనే విధంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా గ్రామీణ అభివృద్ధి ,పంచాయతీ రాజ్, పర్యావరణ శాసDUPUT CM;PAWANKALYAN;CM POST;COMMENTS;VIRAL{#}CBN;kalyan;Janasena;MP;Cinema;Deputy Chief Minister;CM;Telangana Chief Minister;Assembly;Ishtam;Parliament;Partyఏపీ: సీఎం పదవిపై.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. నిరాశేనా..?ఏపీ: సీఎం పదవిపై.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. నిరాశేనా..?DUPUT CM;PAWANKALYAN;CM POST;COMMENTS;VIRAL{#}CBN;kalyan;Janasena;MP;Cinema;Deputy Chief Minister;CM;Telangana Chief Minister;Assembly;Ishtam;Parliament;PartySun, 29 Sep 2024 06:42:00 GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో తన పార్టీ నుంచి నిలబడిన ప్రతిచోట కూడా గెలవడం జరిగింది..21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేయక అన్నిచోట్ల భారీ స్థాయిలోనే రికార్డుగా గెలిచారు పవన్ కళ్యాణ్ దీంతో కూటమిలో భాగంగా ఈయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎంపీ ఎమ్మెల్యేలకు పలు కీలకమైన పదవులను ఇచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు సైతం సగం కల నెరవేరింది అనే విధంగా తెలియజేశారు.


పవన్ కళ్యాణ్ ఎక్కువగా గ్రామీణ అభివృద్ధి ,పంచాయతీ రాజ్, పర్యావరణ శాస్త్ర శాఖలను తీసుకోవడం జరిగింది. అయితే ఎన్నికలలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై తన శాఖల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే ఇలాంటి సమయంలోనే వీలైనప్పుడల్లా ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ అందుకు తగ్గట్టుగా ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి పైన మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.


తనకు ముఖ్యమంత్రి పదవి అంటే పెద్దగా ఇష్టం లేదని తాను సినిమా నటుడిని అవ్వాలనుకోలేదు కానీ అయ్యాను.. డిప్యూటీ సీఎం కావాలని అనుకోలేదు కానీ ఆ పదవిలో ఉన్నానని.. తాను కూడా తన జీవితంలో ఎప్పుడు ఎలాంటి అధికారాన్ని ఆశించలేదంటూ తెలిపారు. నా దేశం కోసం పనిచేయడం తనకు ఇష్టం అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్. దేశం కోసమే నిలవడం తప్ప ఈ అధికార స్థానాలు ఎప్పుడు శాశ్వతం కావంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.


చంద్రబాబు సీఎం పదవికి సరైన వ్యక్తి అని ఆయన అనుభవం అమూల్యమైనదని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనుభవం ఉపయోగపడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తనకి సీఎం పదవి రావాలని కోరిక లేదని కూడా తెలిపారు. అయితే ఈ విషయంలో అటు కాపు సామాజిక వర్గం జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఈ విషయం పైన కాస్త అసంతృప్తితో ఉన్నారట. తమ నేతని సీఎంగా చూడాలని కోవడం ఎప్పటికీ నిరాశేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>