MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tejc890f095-80e8-4c5f-a299-9e75e8a9ed14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tejc890f095-80e8-4c5f-a299-9e75e8a9ed14-415x250-IndiaHerald.jpgవరల్డ్ హార్ట్ డే నేడు.. ఈ సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ఫ్యామిలీతో సహా పాల్గొని తన మంచి మనసును చాటుకున్నారు. అసలు విషయంలోకి వెళితే, మామ చిరంజీవిని మెగా మేనల్లుడు ఫాలో అవుతున్నారనడం లో సందేహం లేదు. ఎవరికైనా సరే కష్టం వస్తే ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటారు చిరంజీవి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా. ఇప్పుడు ఈ విషయంలో రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మేనమామల బాటలోనే మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా దూసుకుపోతున్నారని చెప్పాలి. SAI DHARAM TEJ{#}kalyan;sai dharam tej;Heart;Fidaaపిల్లల కోసం భారీ విరాళం.. మామను ఫాలో అవుతున్న మెగా మేనల్లుడు..!పిల్లల కోసం భారీ విరాళం.. మామను ఫాలో అవుతున్న మెగా మేనల్లుడు..!SAI DHARAM TEJ{#}kalyan;sai dharam tej;Heart;FidaaSun, 29 Sep 2024 12:41:00 GMTవరల్డ్ హార్ట్ డే నేడు.. ఈ సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ఫ్యామిలీతో సహా పాల్గొని తన మంచి మనసును చాటుకున్నారు. అసలు విషయంలోకి వెళితే, మామ చిరంజీవిని మెగా మేనల్లుడు ఫాలో అవుతున్నారనడం లో సందేహం లేదు. ఎవరికైనా సరే కష్టం వస్తే ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటారు చిరంజీవి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా. ఇప్పుడు ఈ విషయంలో రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మేనమామల బాటలోనే మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా దూసుకుపోతున్నారని చెప్పాలి.

ఇటీవలే వరద బాధితులకు రెండు రాష్ట్రాలకు రూ.20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే అమ్మ అనాధాశ్రమానికి పలు సేవా సంస్థల కోసం రూ .5లక్షల విరాళాలు స్వయంగా అందజేశారు సాయిధరమ్ తేజ్. ఇలా రెగ్యులర్ గా సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ విరాళాలు ఇస్తున్న ఈయన..  తాజాగా మరో ఫౌండేషన్ కి కూడా విరాళం ఇచ్చారు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ తన ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు. అక్కడకి వచ్చిన పిల్లలతో ముచ్చట్లు పెట్టారు. వారితో ఫోటోలు కూడా దిగారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కోసం 5 లక్షల రూపాయలు విరాళం అందించారు.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ మంచి మనసుకి మరొకసారి అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు మేనమామల బాటలోనే మెగా మేనల్లుడు కూడా వెళ్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా సాయి ధరంతేజ్ మంచి మనసుకి అందరూ ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>