EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan9c099229-183b-44c0-a96c-50f381fd226a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan9c099229-183b-44c0-a96c-50f381fd226a-415x250-IndiaHerald.jpgతిరుమల లడ్డూ వ్యవహారం ప్రకపంపనలు రేపుతోంది. ముఖ్యంగా ఈ వివాదలో వైసీపీ కార్నర్ అవుతోంది. అందరి వేళ్లు వైసీపీ వైపే చూపిస్తున్నాయి. వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు ఇదే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఆత్మ రక్షణలో పడింది. ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్రగా వైసీపీ అనుమానిస్తోంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటుంది. జగన్లో సైతం ఒక రకమైన భయం కనిపిస్తోంది. తమ హయాంలో తప్పు జరగలేదని చjagan{#}CBN;bhavana;TDP;politics;Party;CM;Jagan;YCP;Bharatiya Janata Party;Government;Andhra Pradesh;Letter;Indiaవారి కోసం ఆశగా ఎదురు చూస్తున్న జగన్? గట్టెక్కిస్తారా..!వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్న జగన్? గట్టెక్కిస్తారా..!jagan{#}CBN;bhavana;TDP;politics;Party;CM;Jagan;YCP;Bharatiya Janata Party;Government;Andhra Pradesh;Letter;IndiaSun, 29 Sep 2024 14:29:00 GMTతిరుమల లడ్డూ వ్యవహారం ప్రకపంపనలు రేపుతోంది. ముఖ్యంగా ఈ వివాదలో వైసీపీ కార్నర్ అవుతోంది. అందరి వేళ్లు వైసీపీ వైపే చూపిస్తున్నాయి. వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు ఇదే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఆత్మ రక్షణలో పడింది. ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్రగా వైసీపీ అనుమానిస్తోంది.


అయితే పార్టీ ఆవిర్భావం నుంచి గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటుంది. జగన్లో సైతం ఒక రకమైన భయం కనిపిస్తోంది. తమ హయాంలో తప్పు జరగలేదని చెప్పేందుకు ఆయన పడుతున్న వ్యధ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఇటువంటి ఆరోపణలు వచ్చిన అప్పుడు దర్యాప్తును కోరతారు.


కానీ జగన్ మాత్రం పరుచు బీజేపీ పెద్దలు, సహిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, స్వామీజీలను గుర్తు చేసుకుంటూ విన్నపాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరోపణలు చేసింది ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు.. ల్యాబ్ నిర్ధారించిన తర్వాత తాను ఈ విషయం బయట పెట్టినట్లు చంద్రబాబు చెబుతున్నారు. అదే సమయంలో జగన్ సైతం సీబీఐతో కానీ.. సింగిల్ జడ్జ్‌ తో కానీ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్పష్టంగా ల్యాబ్ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఎలాంటి ఆధారాలు చూపాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.



లడ్డూ వివాదం నేపథ్యంలో వైసీపీ ఢిపెన్స్ లో పడింది.  ఏ రాజకీయ పార్టీ కూడా జగన్ కు అండగా నిలిచేందుకు సిద్ధంగా లేదు. అదే వస్తే హిందూ సమాజానికి దూరం అవుతామనే భావన ఆయా పార్టీలను వెంటాడుతోంది. ఇండియా కూటమి పార్టీలు సైతం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులకు నేరుగా లేఖలు రాస్తున్నారు జగన్‌.  ఇది ఏపీ రాజకీయాల్లో భాగమని.. కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని అందులో పేర్కొంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి బయట పడే మార్గం జగన్ కు తెలియడం లేదు. దీంతో జగన్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నారు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>