Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆర్య సినిమాతో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2 కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా 2024, డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. సుకుమార్ నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఆయన కథ నచ్చితే చాలు తన సొంత బ్యానర్ లోనే మూవీలు ప్రొడ్యూస్ చేస్తారు. Sukumar WhatsApp {#}arya;sukumar;WhatsApp;Aryaa;media;Allu Arjun;Father;Tirupati;Hero;CBN;Director;School;December;Cinema;Success;Indiaసుకుమార్ వాట్సాప్ డీపీ.. అల్లు అర్జున్ కాదు.. ఎవరి ఫోటో పెట్టుకున్నాడో తెలుసా?సుకుమార్ వాట్సాప్ డీపీ.. అల్లు అర్జున్ కాదు.. ఎవరి ఫోటో పెట్టుకున్నాడో తెలుసా?Sukumar WhatsApp {#}arya;sukumar;WhatsApp;Aryaa;media;Allu Arjun;Father;Tirupati;Hero;CBN;Director;School;December;Cinema;Success;IndiaSun, 29 Sep 2024 11:16:00 GMTక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆర్య సినిమాతో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2 కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా 2024, డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. సుకుమార్ నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఆయన కథ నచ్చితే చాలు తన సొంత బ్యానర్ లోనే మూవీలు ప్రొడ్యూస్ చేస్తారు.

ఇలా కొత్త హీరోలను, దర్శకులను, రచయితలను ఆయన ప్రోత్సహిస్తారు. అంతే కాదు ఇతర సినిమాల ప్రమోషన్ల కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తాజాగా కూడా సుకుమార్ "నాన్న సూపర్ హీరో" సినిమా టీజర్ ఫంక్షన్ కి వెళ్లారు. ఆపై హీరో సుధీర్ బాబుకు కంగ్రాట్యులేట్ చేస్తూ ఓ మెసేజ్ పంపించడం జరిగింది. సుకుమార్ తనని అభినందించడంతో హీరో సుధీర్ బాబు కూడా తెగ ఆనందంతో మురిసిపోయాడు.

అంతేకాదు, సుకుమార్ మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ సుక్కు కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ స్క్రీన్ షాట్ లో సుకుమార్ వాట్సాప్ డీపీ సైతం బయటపడింది. అంతే  ఒక్కసారిగా ఇది వైరల్ గా మారింది. డైరెక్టర్ సుకుమార్ వాట్సాప్ డీపీలో ఎవరి ఫొటో ఉందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు సుకుమార్ తండ్రి తిరుపతి రావు. దురదృష్టవశాత్తు సుకుమార్ తండ్రి కొన్నేళ్ల క్రితం కన్నుమూశారు.
సుధీర్ బాబు ఈ వాట్సాప్ డీపీ గురించి కూడా మాట్లాడాడు. ‘సుకుమార్ గారు మీ డీపీలో మీ నాన్నగారి ఫోటో ఉంది. ఆయన అంటే మీకు ఎంత ఇష్టమో అర్థమవుతోంది. మా మూవీ కూడా నాన్నని సూపర్ హీరోగా చూసే ఓ యువకుడి కథ’ అని అన్నాడు. తిరుపతిరావు, సుకుమార్ మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే తన సినిమాల్లో తండ్రి పాత్రలను చాలా ప్రత్యేకంగా రూపొందిస్తారు. అంతేకాదు, సొంతూరిలో తండ్రి పేరు మీద స్కూల్ బిల్డింగ్ కూడా సొంతంగా నిర్మించారు.

" style="height: 860px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>