MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mokshajna4d98b1f6-297d-4e69-b0cd-15a793a15bbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mokshajna4d98b1f6-297d-4e69-b0cd-15a793a15bbe-415x250-IndiaHerald.jpg రీసెంట్గా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని ప్రకటించారు. అదేవిధంగా సినిమాలో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ని కూడా రివిల్ చేశారు. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమా మొదలుకావడానికి ఇంకా టైం బట్టి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. Mokshajna{#}Balakrishna;prasanth;prasanth varma;Romantic;Heroine;Tollywood;Director;Cinemaమోక్షజ్ఞతో ప్రశాంత్ శర్మ క్రేజీ ప్లానింగ్..నందమూరి అభిమానులకు బిగ్ అప్డేట్..!మోక్షజ్ఞతో ప్రశాంత్ శర్మ క్రేజీ ప్లానింగ్..నందమూరి అభిమానులకు బిగ్ అప్డేట్..!Mokshajna{#}Balakrishna;prasanth;prasanth varma;Romantic;Heroine;Tollywood;Director;CinemaSun, 29 Sep 2024 12:12:47 GMTనట‌సింహం నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడుగా సూపర్ క్రేజ్‌ తెచ్చుకున్న ప్రశాంత్ వ‌ర్మా డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని ప్రకటించారు. అదేవిధంగా సినిమాలో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ని కూడా రివిల్ చేశారు. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమా మొదలుకావడానికి ఇంకా టైం బట్టి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


ప్రస్తుతం మోక్షజ్ఞ మూవీ కోసం ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞను ఈ మూవీలో ఒక రొమాంటిక్ క్యూట్ లుక్ తో చూపించబోతున్నాడట. అయితే ప్రశాంత్  ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో హీరోలను మాస్ అండ్‌ రఫ్ లుక్ లోనే చూపించడు. కానీ మోక్షజ్ఞ సినిమా విషయంలో మాత్రం చాలా కూల్ అండ్ రొమాంటిక్ లుక్ లో చూపించబోతున్నారట. నందమూరి అభిమానులు మాత్రం మోక్షజ్ఞను మాస్ లుక్ లో చూడాలని అనుకుంటున్నారు. కానీ ప్రశాంత్ వర్మ ఏం చేసినా కొత్తగా సినిమా హిట్ అయ్యేలా చేస్తాడు.. కనుక క్యూట్ లుక్ లో చూపించిన పరవాలేదని కూడా అంటున్నారు.


ఇక హనుమాన్ తర్వాత జై హనుమాన్ ను ప్రకటించిన దర్శకుడు ప్రశాంత్ ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.. మధ్యలో మోక్షజ్ఞ సినిమాను ప్రకటించాడు దాంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలను ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. మోక్షజ్ఞ తొలి సినిమాలో బాలకృష్ణ లేదా  కళ్యాణ్ రామ్ తో గెస్ట్ రోల్ చేయించాలని కూడా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా ముందు ముందు ఈ విషయం పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. అదే విధంగా మోక్షజ్ఞ తొలి సినిమా కావటంతో స్పెషల్ గెస్ట్ అఫీరియన్స్ ఉంటే అన్ని విధాలుగా సినిమాకు హెల్ప్ అవుతుంది అని కూడా భావిస్తున్నారట. ఈ సినిమాలో మోక్షజ్ఞకు జంటగా హీరోయిన్ ఎవరా అంటూ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరోయిన్ లేదా శ్రీలీలను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోబోతున్నారు అంటూ టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>