EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth00754b2b-5d1d-40cf-ad75-de5a50244ed6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth00754b2b-5d1d-40cf-ad75-de5a50244ed6-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టు ప్రధానంగా హైదరాబాద్ నదీ సుందరీకరణ. నీటి శుద్ధికి మాత్రమే పరిమితం. హైదరాబాద్ దిగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నదీ తీరం వెంబడి ఏర్పాటైన పరిశ్రమల నుంచి నదిలో కలిసే వ్యర్థా రసాయనాలతో నది నీరు పూర్తి కాలుష్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కాలుష్యాన్ని నివారించాలని పదే పదే డిమాండ్లు వస్తున్నా ప్రస్తుత ప్రాజెక్టులో దీని చేర్చలేదు. ప్రధానంగా మూసీ నీటితో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 23 వరకు కత్వలు, ఆనకట్టల ద్వారా దాదాపు 150 కి పైగా చెరువులు అనrevanth{#}KTR;Nalgonda;kaleshwaram;Ranga Reddy;pollution;Aqua;Hyderabad;Party;CM;Government;Congressకాంగ్రెస్ ని మూసీ ముంచుతోందా? నెక్స్ట్ రేవంత్ ప్లాన్ ఏంటి?కాంగ్రెస్ ని మూసీ ముంచుతోందా? నెక్స్ట్ రేవంత్ ప్లాన్ ఏంటి?revanth{#}KTR;Nalgonda;kaleshwaram;Ranga Reddy;pollution;Aqua;Hyderabad;Party;CM;Government;CongressSun, 29 Sep 2024 15:12:00 GMTరాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టు ప్రధానంగా హైదరాబాద్ నదీ సుందరీకరణ. నీటి శుద్ధికి మాత్రమే పరిమితం. హైదరాబాద్ దిగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నదీ తీరం వెంబడి ఏర్పాటైన పరిశ్రమల నుంచి నదిలో కలిసే వ్యర్థా రసాయనాలతో నది నీరు పూర్తి కాలుష్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కాలుష్యాన్ని నివారించాలని పదే పదే డిమాండ్లు వస్తున్నా ప్రస్తుత ప్రాజెక్టులో దీని చేర్చలేదు.


ప్రధానంగా మూసీ నీటితో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 23 వరకు కత్వలు, ఆనకట్టల ద్వారా దాదాపు 150 కి పైగా చెరువులు అనుసంధానం అవుతాయి. దిగువన ఉన్న కేతేపల్లి వద్ద మూసీ ప్రాజెక్టు ఉంది. ఈ మొత్తం వనరుల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు నీరు అందుతోంది. అయితే మూసీ నీరు కలుషితం కావడంతో ఇక్కడ పండే పంటలకు, కూరగాయాలకు, చేపలకు డిమాండ్ లేకుండా పోతోంది.


ఇంత తీవ్ర ఇబ్బంది మూసీ రైతాంగం ఎదుర్కొంటున్నా కాలుష్యాన్ని నివారించడానికి ఈ ప్రాజెక్టులో స్థానం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అనుసంధానంగా ఒక్కం ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని ఈ ప్రాజెక్టు రూ.1.50లక్షల కోట్టు ఖర్చు పెట్టడం కేవలం దోచుకోవడానికే ప్రతపక్షాల విమర్శలకు ప్రభుత్వం వద్ద సమాధానం కొరవడింది.


మూసీ ప్రాజెక్టుని ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుగా చెప్పడం, అదే సమయంలో సీఎం సొంత జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే పాలూరు రంగారెడ్డిని పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకవైపు మూసీ ప్రాజెక్టుతో కాంగ్రెస్ నేతలకు అక్రమ సంపాదన తప్ప, మరే ఉపయోగం లేదని కేటీఆర్ విమర్శిస్తున్నారు. కాళేశ్వరం పేరుతో అప్పటి బీఆర్ఎస్ ధన దోపిడికి పాల్పడిందనే ఆరోపణలకు కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు ధన ప్రయోజనం కోసం మూసీ ప్రాజెక్టు అనే వాదాన్ని బీఆర్ఎస్ నేతలు తెరపైకి తెచ్చారు. దీనిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>