LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/symptoms--visible-immediately-careful-81707de1-4297-4e85-aa95-458f0811a939-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/symptoms--visible-immediately-careful-81707de1-4297-4e85-aa95-458f0811a939-415x250-IndiaHerald.jpgచాలామందికి తలనొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. తరచుగా ఈ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకో తెలుసా? కండరాలు నొప్పి, తలనొప్పి తరచుగా వేధిస్తున్నాయా? అది నిద్ర లేదా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఆకలి మందగించడం లేదా అసలుకే లేకపోవటం, ఎప్పుడూ అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మీరు తీవ్రమైన ఒత్తిడి లేదా డిప్రెషన్ లో ఉండవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఈ తరహా లక్షణాలు వీరిలోనే ఎక్కువగా కనిపిస్తsymptoms ; visible; immediately; careful {#}Sugarఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే తక్షణమే జాగ్రత్త పడండి..!ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే తక్షణమే జాగ్రత్త పడండి..!symptoms ; visible; immediately; careful {#}SugarSat, 28 Sep 2024 15:57:00 GMTచాలామందికి తలనొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. తరచుగా ఈ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకో తెలుసా? కండరాలు నొప్పి, తలనొప్పి తరచుగా వేధిస్తున్నాయా? అది నిద్ర లేదా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఆకలి మందగించడం లేదా అసలుకే లేకపోవటం, ఎప్పుడూ అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మీరు తీవ్రమైన ఒత్తిడి లేదా డిప్రెషన్ లో ఉండవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఈ తరహా లక్షణాలు వీరిలోనే ఎక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు.

దీర్ఘకాలం కొనసాగితే మధుమేహం, హార్మోన్ల అసమదూల్యత సహా పలు ఇతర అనారోగ్యాలకు దారి తీయవచ్చు. సాధారణంగా అనేక వ్యాధులకు ఒత్తిడి కూడా కారణం అవుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఏ అనారోగ్య సమస్య అయిన ముందుగా స్ట్రెస్ తోనే ప్రారంభం అవుతుంది. అలాంటి వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి. అందుకే ఒత్తిడికి, మధుమేహానికి మధ్య సంబంధం ఉందని వాయిద్య నిపుణులు చెప్తుంటారు. ఎలాగంటే... స్ట్రిస్ కు గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని కారణంగా బాడీలో గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయని, మధుమేహానికి కారణం అవుతాయని చెప్పారు.

కార్టిసాల్ తో పాటు కాటెకోలమైన్స్, థైరాయిడ్ సహా శరీరంలోని వివిధ హార్మోన్లలో మార్పులు, హెచ్ తగ్గులు ప్రారంభిస్తాయని, ఈ పరిస్థితి హార్మోన్ల అసమతుల్యతకు, ఇతర వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఒత్తిడి తక్కువగా ఉండే జీవనశైలిని కలిగి ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడి అనేది సహజమే అనుకుంటాం. అది సాధారణంగా ఉన్నంతవరకు పర్లేదు కానీ... అధిక ఒత్తిడి అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి లక్షణాలను గుర్తించి జాగ్రత్తపడితే స్ట్రెస్, యాంగ్జైటి, డిప్రెషన్, మధుమేహం సహా పలు ఇతర వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. ఇక లక్షణాల విషయానికి వస్తే కండరాల నొప్పి, తలనొప్పి, నిద్రలేమి, తరచుగా అనారోగ్యానికి గురవుతుండడం, అలసట, ఆకలి మందగించటం లేదా అధిక ఆకలి వంటివి ఒత్తిడిలో ఉన్న వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>