Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood28400717-15af-4590-94f5-46b282150182-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood28400717-15af-4590-94f5-46b282150182-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా స్థాయి ప్రస్తుతం గ్లోబల్ స్థాయికి చేరింది.. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ చిత్ర సీమ గా వున్న టాలీవుడ్ ఇప్పుడు ఇంతటి స్థాయికి చేరడానికి కారణం మన దర్శకుల ప్రతిభ అనే చెప్పాలి.. కెరీర్ ప్రారంభం నుంచి ఒక్క ప్లాప్ కూడా లేని దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి అనే సినిమాతో గ్లోబల్ మార్కెట్ పై అతి పెద్ద అడుగేసాడు..రాజమౌళి వేసిన ఆ అడుగు టాలీవుడ్ చరిత్రను మార్చేసింది..ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా గురించే చెప్పుకునేవారు.. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ముందుగా తెలుగు ఇండస్ట్రీ గుర్తుకు వస#tollywood{#}RRR Movie;Rayalaseema;Rajamouli;Oscar;vegetable market;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;Tollywood;bhavana;Hindi;Indian;Cinema;Telugu;Indiaటెక్నాలజీ పెరుగుతున్నా.. కథలు పాత చింతకాయ పచ్చడేనా..?టెక్నాలజీ పెరుగుతున్నా.. కథలు పాత చింతకాయ పచ్చడేనా..?#tollywood{#}RRR Movie;Rayalaseema;Rajamouli;Oscar;vegetable market;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;Tollywood;bhavana;Hindi;Indian;Cinema;Telugu;IndiaSat, 28 Sep 2024 07:22:43 GMT* టెక్నాలజి పెరుగుతున్న అప్డేట్ అవ్వని తెలుగు దర్శకులు

* రొట్ట కథలతోనే పాన్ ఇండియా సినిమాలు

* డిజాస్టర్స్ వచ్చినా మారని దర్శకుల తీరు..


టాలీవుడ్ సినిమా స్థాయి ప్రస్తుతం గ్లోబల్ స్థాయికి చేరింది.. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ చిత్ర సీమ గా వున్న టాలీవుడ్ ఇప్పుడు ఇంతటి స్థాయికి చేరడానికి కారణం మన దర్శకుల ప్రతిభ అనే చెప్పాలి.. కెరీర్ ప్రారంభం నుంచి ఒక్క ప్లాప్ కూడా లేని దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి అనే సినిమాతో గ్లోబల్ మార్కెట్ పై అతి పెద్ద అడుగేసాడు..రాజమౌళి వేసిన ఆ అడుగు టాలీవుడ్ చరిత్రను మార్చేసింది..ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా గురించే చెప్పుకునేవారు.. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ముందుగా తెలుగు ఇండస్ట్రీ గుర్తుకు వస్తుంది.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించి తెలుగు సినిమా సత్తా చాటారు.. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన తెలుగు ఇండస్ట్రీ లో రాజమౌళి లాంటి వారు ఒక్కరే వున్నారా అని అనిపిస్తుంది.. మిగతా దర్శకులు సైతం మంచి సినిమాలు తీసిన అవి టాలీవుడ్ వరకే మంచి విజయం సాధిస్తున్నాయి.


గతంలో టెక్నాలజీ లేకున్నా కూడా అప్పటి దర్శకులు మంచి కథలను ఎంచుకుని ప్రేక్షకులకి హత్తుకునే సినిమాలు ఎన్నో తీశారు. కానీ నేడు టెక్నాలజి అంత డెవలప్ అయినా కానీ మంచి సినిమాలు రావడం లేదు.. సినిమాలలో టెక్నాలజి వాడుతున్న కూడా కథ విషయంలో తేడా కొడుతుంది.. కారణం కథ పాత చింతకాయ పచ్చడిలా ఉండటం.. అయితే రాజమౌళి సైతం పాత కథలను సినిమాలుగా తీస్తారు..అంతెందుకు సినిమా మొదలు పెట్టేటప్పుడే మా సినిమా కథ ఇది అని చెప్పేసి ప్రేక్షకులని మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు.. ఆ పాత కథనే మరింత కొత్తగా రాజమౌళి చూపిస్తుంటారు.. మిగిలిన దర్శకులు మాత్రం ఈ విషయంలో వెనుకబడి వున్నారు.. సినిమా కథ పాతది అయినా కథనంలో మ్యాజిక్ చేయాలి.. అప్పుడే ప్రేక్షకుడికి ఒక అద్భుతమైన సినిమా చూసాము అనే భావన కలుగుతుంది.. పాత కథతో అర్థంపర్థంలేని కథనంతో పాన్ ఇండియా రేంజ్ మూవీలు తీసిన నిర్మాతకు నష్టం తప్ప ఇంకేమి ఉండదు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>