MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-151a8c38-dacf-438b-88e9-86316fbed7f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-151a8c38-dacf-438b-88e9-86316fbed7f9-415x250-IndiaHerald.jpgఇక ఈ సినిమాకు రెండు రోజుల ముందు నుంచే మామూలు హంగా మా జ‌ర‌గ‌లేదు. ఇక గురువారం అర్ధ‌రాత్రి నుంచే దేవ‌ర సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కెరీర్ లోనే హ్యూజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా గా దేవ‌ర రికార్డుల‌కు ఎక్కేసింది. Devara {#}Telangana;Andhra Pradesh;Tollywood;India;NTR;Cinema' దేవ‌ర ' ఫ‌స్ట్ వ‌ర‌ల్డ్ వైడ్ రు. 172 కోట్లు... యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు... !' దేవ‌ర ' ఫ‌స్ట్ వ‌ర‌ల్డ్ వైడ్ రు. 172 కోట్లు... యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు... !Devara {#}Telangana;Andhra Pradesh;Tollywood;India;NTR;CinemaSat, 28 Sep 2024 15:14:08 GMTటాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర పార్ట్ 1 సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా పై క‌ని వినీ ఎరుగ‌ని రేంజ్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు రెండు రోజుల ముందు నుంచే మామూలు హంగా మా జ‌ర‌గ‌లేదు. ఇక గురువారం అర్ధ‌రాత్రి నుంచే దేవ‌ర సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కెరీర్ లోనే హ్యూజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా గా దేవ‌ర రికార్డుల‌కు ఎక్కేసింది.


ఇప్ప‌టికే టెంప‌ర్ సినిమా నుంచి ఆరు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్ దేవ‌ర సినిమా తో వ‌రుస‌గా ఏడో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక దేవ‌ర ముందు నుంచి అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ కెరీర్ టాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సాధించింది. ఇలా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 172 కోట్ల గ్రాస్ ని అందుకొని ఈ ఏడాదిలో మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అయితే ఏపీ - తెలంగాణ తో పాటు ఇండియా వైజ్ గా దేవ‌ర‌కు రు. 77 కోట్లు వ‌చ్చాయంటున్నారు.


మ‌రి మేక‌ర్స్ వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 172 కోట్లు వ‌చ్చిన‌ట్టు ఎలా పోస్ట‌ర్ వేశారంటూ కొంద‌రు యాంటీ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ఇండియాలో రు. 77 కోట్లు వ‌స్తే వ‌ర‌ల్డ్ వైడ్ గా మ‌రో రు. 95 కోట్లు రావ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని సెటైర్లు పేల్చ‌తున్నారు. మ‌రి మేక‌ర్స్ రు. 172 కోట్ల పోస్ట‌ర్ తో పాటు ఏరియాల వారీ పోస్ట‌ర్లు లేదా నెంబ‌ర్లు చెపితే బాగుంటుంద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>