PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-pawan-afraid-of-prakash-rajs-tweetsd935fe5c-c8e4-43c6-b29d-0095efcf6dba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-pawan-afraid-of-prakash-rajs-tweetsd935fe5c-c8e4-43c6-b29d-0095efcf6dba-415x250-IndiaHerald.jpgప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒకరు పవర్ స్టార్ అయితే, మరొకరు విలక్షణ నటులు. ఇక వీరి మధ్య సంబంధం కూడా చాలా ఆరోగ్యకరంగానే ఉంటుంది. అయితే అది సినిమాల వరకు మాత్రమే! రాజకీయం పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరివి వేరు వేరు దారులు అని చెప్పుకోవచ్చు. రాజకీయం విషయంలో సైద్ధాంతిక పరంగా ఇద్దరూ విభేదిస్తారు. తాజాగా అటువంటి సంఘటననే జరిగింది. ఇక ఈ విషయం గురించి కూడా అందరికీ తెలిసిందే. పవన్ {#}kalyan;Ladoo;Cholesterol;Ghee;Sri Venkateswara swamy;Prakash Raj;Pawan Kalyan;Janasena;Tirupati;CM;YCPప్రకాష్ రాజ్ ట్వీట్లకు పవన్ భయపడ్డారా?ప్రకాష్ రాజ్ ట్వీట్లకు పవన్ భయపడ్డారా?పవన్ {#}kalyan;Ladoo;Cholesterol;Ghee;Sri Venkateswara swamy;Prakash Raj;Pawan Kalyan;Janasena;Tirupati;CM;YCPSat, 28 Sep 2024 11:40:00 GMTప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒకరు పవర్ స్టార్ అయితే, మరొకరు విలక్షణ నటులు. ఇక వీరి మధ్య సంబంధం కూడా చాలా ఆరోగ్యకరంగానే ఉంటుంది. అయితే అది సినిమాల వరకు మాత్రమే! రాజకీయం పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరివి వేరు వేరు దారులు అని చెప్పుకోవచ్చు. రాజకీయం విషయంలో సైద్ధాంతిక పరంగా ఇద్దరూ విభేదిస్తారు. తాజాగా అటువంటి సంఘటననే జరిగింది. ఇక ఈ విషయం గురించి కూడా అందరికీ తెలిసిందే.

గడిచిన రెండు వారాల నుండి ఆంధ్రాలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం గురించి ఒక వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు, గత వైసిపి పాలకులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపహాస్యం చేశారని, లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి వాడకంలో పొరపాట్లు దొర్లాయని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో మొదలైన వివాదం ఇంకా రాజుకుంటోంది అని చెప్పుకోవాలి. లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఇక ఆ మాటలకు మద్దతునిస్తూ డిప్యూటీ సీఎం, జనసేన ని పవన్ కళ్యాణ్ వైసీపీని గట్టిగా విమర్శించిన సంగతి కూడా విధితమే.

అయితే ఈ మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో, పవన్ ఆడే మాటల్ని ఖండిస్తూ ప్రకాష్ రాజ్ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అయితే దానికి పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. క్రమంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై ట్వీట్స్ యుద్ధాన్ని ప్రకటించారు. అయితే ఇందులో వేటికి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వకపోవడం కొసమెరుపు. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు వెనక్కి తగ్గాడని ఓవర్గం వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీనిపై మీ స్పందన ఏమిటో కింద కామెంట్ల రూపంలో తెలియ జేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>