MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ap-devara-first-day-share-in-telangana-both-ntr-movies-in-top-2-of-all-time577e2949-36ab-4255-9fae-d17161ba2939-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ap-devara-first-day-share-in-telangana-both-ntr-movies-in-top-2-of-all-time577e2949-36ab-4255-9fae-d17161ba2939-415x250-IndiaHerald.jpgతాజా గా దేవ‌ర సినిమా తో ఎన్టీఆర్ ఏపీ - తెలంగాణ‌ బాక్సాఫీస్ బరిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన దేవ‌ర‌ సినిమా మొదటి రోజు హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించింది. ap devara first day{#}Telangana;Andhra Pradesh;Tollywood;NTR;Cinema;Telugu;Indiaఏపీ - తెలంగాణలో 'దేవర' ఫస్ట్ డే షేర్ - ఆల్ టైమ్ టాప్ 2లో రెండూ ఎన్టీఆర్ సినిమాలే ..!ఏపీ - తెలంగాణలో 'దేవర' ఫస్ట్ డే షేర్ - ఆల్ టైమ్ టాప్ 2లో రెండూ ఎన్టీఆర్ సినిమాలే ..!ap devara first day{#}Telangana;Andhra Pradesh;Tollywood;NTR;Cinema;Telugu;IndiaSat, 28 Sep 2024 10:37:20 GMT- ఏపీ - తెలంగాణ ఫ‌స్ట్ డే షేర్ 54.21 కోట్లు

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ లో రికార్డులు కొత్త కాదు. ఇప్ప‌టికే డ‌బుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌తో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లోనూ త‌న స్టామినా ఏంటో చూపించాడు. ఇప్పుడు దేవ‌ర దెబ్బ‌కు రికార్డుల దుమ్ము దులిపేస్తున్నాడు. తాజా గా దేవ‌ర సినిమా తో ఎన్టీఆర్ ఏపీ - తెలంగాణ‌ బాక్సాఫీస్ బరిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన దేవ‌ర‌ సినిమా మొదటి రోజు హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించింది.


ఇక తెలుగునాట 'దేవర'కు థియేటర్లలో బ్రహ్మరథం పట్టారు. అర్ధ‌రాత్రి ఒంటి గంట నుంచే  తెలంగాణ, ఏపీలో బెనిఫిట్ షోలు పడ్డాయి. దాంతో సినిమా హాళ్ల దగ్గర పండగ నిజం చెప్పాలంటే సంక్రాంతి ని మించిన పండ‌గ‌ వాతావరణం కనిపించింది. ఆ జోరు వసూళ్లలోనూ చాలా క్లీయ‌ర్ గా కనిపించింది.


ఏపీ, తెలంగాణలో ఓపెనింగ్ హయ్యస్ట్ షేర్ త్రిబుల్ ఆర్ పేరు తో ఉంది. ఈ సినిమా రూ. 74.11 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్నటి వరకు ఆ తర్వాత స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమా ఉండ‌గా.. ఇప్పుడు దేవ‌ర బ్రేక్ చేసింది. స‌లార్ సినిమాకు తెలంగాణ, ఏపీలో మొదటి రోజు రూ. 50.49 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పుడు రూ. 54.21 కోట్ల షేర్ సాధించి రెండో స్థానంలోకి 'దేవర' వచ్చింది. ఏరియాల వారీగా మొదటి రోజు ఏపీ, తెలంగాణలో 'దేవర'కు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల షేర్ వచ్చిందో ఆ నెంబ‌ర్స్ ఇలా ఉన్నాయి.


నైజాం (తెలంగాణ) -    రూ. 19.32 కోట్లు
విశాఖ -    రూ. 5.47 కోట్లు
గుంటూరు -    రూ. 6.27 కోట్లు
నెల్లూరు -    రూ. 2.11 కోట్లు
కృష్ణ -    రూ. 3.02 కోట్లు
ఈస్ట్ -    రూ. 4.02 కోట్లు
వెస్ట్‌ -    రూ. 3.60 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) -    రూ. 10.40 కోట్లు
--------------------------------------------------------------
ఏపీ + తెలంగాణలో టోటల్ షేర్    = రూ. 54.21 కోట్లు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>