Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bhumra2915794d-00b3-4472-9b3a-1cc160f13ee5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bhumra2915794d-00b3-4472-9b3a-1cc160f13ee5-415x250-IndiaHerald.jpgటీం ఇండియా సీనియర్ క్రికెటర్లు అయినటువంటి కోహ్లీ, జడేజా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరు క్రికెట్ ని ఎంత అద్భుతంగా ఆడుతారో, అంతే జోవియల్ గా తోటి సహా ఆటగాళ్లతో వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ప్రత్యేకించి వారిద్దరూ అంటే మిగతా వారికి ఎనలేని అభిమానం ఉంటుంది. ఇక సీనియర్లుగా వారికి ఇవ్వాల్సిన గౌరవంతో పాటుగా, ఎక్కువ మందిక వారిని ప్రేమిస్తూ ఉంటారు. అందుకే కొందరు జూనియర్లు వారిని సూపర్ మేన్స్ అని కూడా సరదాగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే, కాన్పూర్ లో తాజాగా జరిగిన రెంbhumra{#}Ravindra Jadeja;Yashasvi Jaiswal;VIRAT KOHLI;Rohit Sharma;Kanpur;Bangladesh;Cricket;GEUM;Varsham;Indiaబుమ్రాతో ఆడుకున్న కోహ్లీ, జడేజా.. పాపం.. వైరల్ వీడియో?బుమ్రాతో ఆడుకున్న కోహ్లీ, జడేజా.. పాపం.. వైరల్ వీడియో?bhumra{#}Ravindra Jadeja;Yashasvi Jaiswal;VIRAT KOHLI;Rohit Sharma;Kanpur;Bangladesh;Cricket;GEUM;Varsham;IndiaSat, 28 Sep 2024 13:16:00 GMTటీం ఇండియా సీనియర్ క్రికెటర్లు అయినటువంటి కోహ్లీ, జడేజా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరు క్రికెట్ ని ఎంత అద్భుతంగా ఆడుతారో, అంతే జోవియల్ గా తోటి సహా ఆటగాళ్లతో వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ప్రత్యేకించి వారిద్దరూ అంటే మిగతా వారికి ఎనలేని అభిమానం ఉంటుంది. ఇక సీనియర్లుగా వారికి ఇవ్వాల్సిన గౌరవంతో పాటుగా, ఎక్కువ మందిక వారిని ప్రేమిస్తూ ఉంటారు. అందుకే కొందరు జూనియర్లు వారిని సూపర్ మేన్స్ అని కూడా సరదాగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే, కాన్పూర్ లో తాజాగా జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఓ గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది.

ఎక్కడ క్రీడా మైదానంలో కోహ్లీ, జడేజా బౌలింగ్ వేసే సందర్భంలో టాలెంటెడ్ బౌలింగ్ వీరుడు బుమ్రాను ఇమిటేట్ చేస్తూ బౌలింగ్ చేయడంతో అది చూసిన అభిమానులు, తోటి క్రీడాకారులు కేరింతలు కొట్టడం జరిగింది. బుమ్రాను అలా సరదాగా ఆటపట్టించడంతో పక్కనే ఉన్న యశస్వి జైస్వాల్, కోచ్ సరదాగా నవ్వుకున్నారు. ఇకపోతే బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ను కోహ్లీ అచ్చుగుద్దినట్లు దింపేస్తాడనే విషయం తెలిసిందే. ఈ సారి కూడా అదే రీతిలో ఇమిటేట్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేశాడు. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కాన్పూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ దృశ్యం చూపరులను అలరించింది. ఇక వర్షం కారణంగా గేమ్ సరిగ్గా జరగకపోవడంతో ఇటువంటి సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలుచుకుని మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా తొలిరోజు ఆట కేవలం 35 ఓవర్లతోనే ముగిసింది. బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయి, 107 రన్స్ మాత్రమే చేసింది. మోమినుల్‌ 40, ముష్పికర్‌ రహీమ్‌ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇక మీరు సోషల్ మీడియాలో ఇమిటేట్ చేసిన కోహ్లీ వీడియో చూసినట్లయితే అది ఎలా ఉందో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>