MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pan-india-movie-tollywood-directors-hero-producers-5143231d-b4bd-4d9a-a609-e9ca3220d835-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pan-india-movie-tollywood-directors-hero-producers-5143231d-b4bd-4d9a-a609-e9ca3220d835-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మిగతా ఇండస్ట్రీల వారికి చాలా చిన్నచూపు ఉండేది. ఆ చిన్న చూపును ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో కాస్త తీసి అవతల పడేశారు. వారి కాలంలో ఇండస్ట్రీని ఎంతో డెవలప్ చేసి వారు కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక వారి కాలం తర్వాత కొన్నాళ్లపాటు తెలుగు ఇండస్ట్రీ మరింత దిగజారిపోయింది. అలా మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీ అంటే కాస్త చులకన భావం ఉండేది. అలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఎదిగేలా చేశారు రాజమౌళి. బాహుబలి ద్వారా తెలుగు వాడి సత్తాను పాన్ ఇండియా లెవPAN INDIA MOVIE; TOLLYWOOD; DIRECTORS ;HERO; PRODUCERS; {#}Kathanam;Industry;AdiNarayanaReddy;Bahubali;bollywood;NTR;Telugu;Tollywood;Box office;Hero;Cinema;Indiaఫలితం లేని పాన్ ఇండియా..నిర్మాతలే వణుకుతున్నారా.?ఫలితం లేని పాన్ ఇండియా..నిర్మాతలే వణుకుతున్నారా.?PAN INDIA MOVIE; TOLLYWOOD; DIRECTORS ;HERO; PRODUCERS; {#}Kathanam;Industry;AdiNarayanaReddy;Bahubali;bollywood;NTR;Telugu;Tollywood;Box office;Hero;Cinema;IndiaSat, 28 Sep 2024 08:58:00 GMT- కథలో కంటెంట్ లేకుండా వస్తున్న చిత్రాలు..
- పాన్ ఇండియా పేరుతో ప్రజలకు టోపీ..
- పది సినిమాలు రిలీజ్ అయితే 7 ఫ్లాప్ 3హిట్..

 ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మిగతా ఇండస్ట్రీల వారికి చాలా చిన్నచూపు ఉండేది. ఆ చిన్న చూపును ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో కాస్త తీసి అవతల పడేశారు. వారి కాలంలో ఇండస్ట్రీని ఎంతో డెవలప్ చేసి వారు కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక వారి కాలం తర్వాత కొన్నాళ్లపాటు తెలుగు ఇండస్ట్రీ మరింత దిగజారిపోయింది. అలా మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీ అంటే కాస్త చులకన భావం ఉండేది. అలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీని  ఓ రేంజ్ లో ఎదిగేలా చేశారు రాజమౌళి. బాహుబలి ద్వారా తెలుగు వాడి సత్తాను పాన్ ఇండియా లెవెల్ లో చాటి చూపెట్టాడు.. అలా ఇండస్ట్రీ పైకి ఎదగడం మంచిదే కానీ, ఈ ఎదుగుతున్న క్రమంలో సినిమా తీయాలి అంటేనే భయపడే విధంగా మాత్రం ఇండస్ట్రీ కాకూడదు. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చే పది సినిమాల్లో 3 సినిమాలు మాత్రమే అద్భుతమైన కంటెంట్ తో హిట్ బాట పడుతున్నాయి.  కానీ మిగతా సినిమాలు కథా కథనం సరైన పాన్ ఇండియా లెవెల్ కు సరిపోయే హంగులు లేకపోవడంతో భారీ డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. దీంతో ఈ సినిమాల వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయి మరో సినిమా తీయాలంటేనే వణికి పోతున్నారట. మరి పాన్ ఇండియా వల్ల నిర్మాతలకు కలిగే నష్టాలు ఏంటి వివరాలు ఏంటో చూద్దాం.

 పాన్ ఇండియా వణుకు:
 పాన్ ఇండియా చిత్రం అంటే వందల కోట్ల వ్యవహారం. ఇందులో హీరోలకే బడ్జెట్లో సగం రెమ్యూనరేషన్ గా వెళ్తోంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే చాలా సినిమాలు కథా కథనం విషయంలో బోల్తా పడి చివరికి భారీ ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాయి. ఒకసారి ఒక హీరో పాన్ ఇండియా స్థాయిలో చేసిన తర్వాత మరో చిన్న సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో హీరోల కెరియర్ నిర్మాతల కెరియర్ కూడా డిజాస్టర్ గానే నిలుస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి  భారతీయుడు2, సాహో,రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ లని చవిచూశాయి. దీంతో ఈ రేంజ్ లో సినిమాలు తీయాలంటేనే దర్శక నిర్మాతలు వణికిపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో కూడా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని సినిమా బడ్జెట్లో సగం హీరోకి వెళ్ళేది. దీంతో తీరా సినిమా రిలీజ్ అయి  ఆ విధమైన కలెక్షన్స్ చేయకపోవడంతో దర్శకనిర్మాతలు తీవ్రంగా నష్టపోయేవారు.అలా బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టాల పాలు కావడంతో వారు అవగాహనకు వచ్చి కాస్త సరిదిద్దుకునే ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు.అదేవిధంగా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మొదలైపోయింది. ప్రతి హీరో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేయాలని తీరా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిపోతున్నారు. దీనివల్ల హీరోల కెరియర్ ముగియడమే కాకుండా నిర్మాతలు కనీసం సినిమా తీయాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>