MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-devara-movie-is-a-moment-in-mahabharata2c61b3b9-38b7-48f9-86cd-91659b5e3925-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-devara-movie-is-a-moment-in-mahabharata2c61b3b9-38b7-48f9-86cd-91659b5e3925-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దేవర సినిమా రిలీజై రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. ఒక ఇండియాలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా దేవర మానియా నడుస్తోంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు అయితే థియేటర్ల ముందు టపాసులు పేల్చుతూ, ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేస్తున్నారు. దేవర సినిమాలో తమ అన్న ఎన్టీఆర్ ఇరగదీసేశాడని గొప్పలు పోతున్నారు. ఈ సందర్భంగా కొరటాల శివ బ్యానర్లపై కూడా పాలాభిషేకం చేస్తున్న ఘటనలు మనం చూడవచ్devara{#}Manam;Audience;koratala siva;tara;Darsakudu;lord siva;Shiva;Heroine;Jr NTR;Director;NTR;Cinema;Teluguమహాభారతంలో ఓ ఘట్టమే దేవర సినిమా!మహాభారతంలో ఓ ఘట్టమే దేవర సినిమా!devara{#}Manam;Audience;koratala siva;tara;Darsakudu;lord siva;Shiva;Heroine;Jr NTR;Director;NTR;Cinema;TeluguFri, 27 Sep 2024 11:36:00 GMTతెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దేవర సినిమా రిలీజై రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. ఒక ఇండియాలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా దేవర మానియా నడుస్తోంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు అయితే థియేటర్ల ముందు టపాసులు పేల్చుతూ, ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేస్తున్నారు. దేవర సినిమాలో తమ అన్న ఎన్టీఆర్ ఇరగదీసేశాడని గొప్పలు పోతున్నారు. ఈ సందర్భంగా కొరటాల శివ బ్యానర్లపై కూడా పాలాభిషేకం చేస్తున్న ఘటనలు మనం చూడవచ్చు.

ఇక ఎట్టకేలకు సినిమా విడుదల కావడంతో, ఈ సినిమా కథ గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. మరి ముఖ్యంగా దేవర సినిమాలోని దేవర న్యాయం అంశం పైన ముఖ్యంగా ఓ వార్త చలామణి అవుతుంది. మహాభారత గాధలోని దేవర న్యాయం అనే ఘట్టాన్ని వాడుకొని దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడని సినిమా చూసిన ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో చెప్పుకొస్తున్నారు.

తెలుగు టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా పైన మొదటి నుండే అవకాశాలు ఆకాశాన్ని అంటాయి అని చెప్పుకోవచ్చు. రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన ప్రసార చిత్రాలు, టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్, పాటలు సినిమా పైన అంచనాలు పెంచేశాయి. అందరూ అనుకున్నట్టుగానే దేవర సినిమా అభిమానుల అంచనాలను దాటేసిందని కూడా తెలుస్తోంది. ఇక మీలో ఎవరైనా ఈ సినిమాని ఇప్పటికే చూసినట్లయితే, దేవర సినిమా ఎలా ఉందో? అదేవిధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఈ ఎలా నటించారో కింద కామెంట్ల రూపంలో తెలియ జేయండి. అదే విధంగా దేవర అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ చూస్తూనే ఉండండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>