MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/namrata-9e5c9c19-5a0e-4918-af5a-9253fe16a82e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/namrata-9e5c9c19-5a0e-4918-af5a-9253fe16a82e-415x250-IndiaHerald.jpgనమ్రత ముందుగా ఓ రెస్టారెంట్ ఓనర్ అయిన దీపక్ శెట్టితో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. నమ్రత- దీపక్ ఏకంగా తొమ్మిది సంవత్సరాలకు పైగా డేటింగ్ చేశారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారు. కానీ అతను అనుకోకుండా చనిపోవడంతో వీరి బంధానికి బ్రేక్ పడింది. అయితే అతని మ‌ర‌ణం పైన కూడా గతంలో పలు అనుమానాలు కూడా వచ్చాయి. Namrata {#}mahesh babu;marriage;Loveనమ్రత ఫస్ట్ లవ్ మహేష్ కాదా..తొమ్మిదేళ్ల డేటింగ్.? కానీ చివరికి..?నమ్రత ఫస్ట్ లవ్ మహేష్ కాదా..తొమ్మిదేళ్ల డేటింగ్.? కానీ చివరికి..?Namrata {#}mahesh babu;marriage;LoveFri, 27 Sep 2024 14:01:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మోడల్గా కెరిర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగి అగ్ర హీరోలతో సినిమాలు చేసీ.. మహేష్ తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు నమ్రత మొదటి లవ్ మహేష్ బాబు కాదట.. ఇంతకీ అతను ఎవరు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.


నమ్రత  ముందుగా ఓ రెస్టారెంట్ ఓనర్ అయిన దీపక్ శెట్టితో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. నమ్రత- దీపక్ ఏకంగా తొమ్మిది సంవత్సరాలకు పైగా డేటింగ్ చేశారు.  వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారు. కానీ అతను అనుకోకుండా చనిపోవడంతో వీరి బంధానికి బ్రేక్ పడింది. అయితే అతని మ‌ర‌ణం పైన కూడా గతంలో పలు అనుమానాలు కూడా వచ్చాయి.


1990లో బాలీవుడ్‌కు చెందిన ఓ మీడియా నమ్రత ను దీపక్‌ని మీరు పెళ్లి చేసుకుంటారా అని అడగగా ఆ ప్రశ్నకు నమ్రత కచ్చితంగా చేసుకుంటానని చెప్పింది.. త్వరలోనే నేను దీపక్ని పెళ్లి చేసుకుంటాను మేము సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం అని కూడా అంది.. అయితే దీని తర్వాత ఈ జంట విడిపోయింది. వీరిద్దరు విడిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత దీపక్ చనిపోయాడు. గోవాలో ఓ చిన్న పిల్లాడిని కాపాడడానికి ప్రయత్నించి ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది.


ఇక అదే ఏడాది న‌మ్ర‌త‌  తల్లి కుందా కూడా క్యాన్సర్ తో మరణించింది. ఆ తర్వాత హీరోయిన్గా నమ్రత వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా మారంది. అదే క్రమంలో మహేష్ తో ప్రేమలో పడింది. అయితే న‌మ్ర‌త‌  మిస్ ఇండియా పోటీలకు వెళ్లడానికి ముందే దీప‌క్‌తో ప్రేమలో పడిందని కూడా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత మహేష్ తో పెళ్లి తర్వాత ఆమె సినిమాలుకు గుడ్ బాయ్ చెప్పారు. కుటుంబానికి పరిమితం అయ్యారు తన పిల్లని చూసుకుంటూ బిజీగా గడిపేశారు. ప్రస్తుతం నమ్ర‌త‌  రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని వార్తలు కూడా వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>