MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss4b48287d-400e-4aae-8a66-6aa96ebc5f1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss4b48287d-400e-4aae-8a66-6aa96ebc5f1f-415x250-IndiaHerald.jpgబిగ్బాస్ తెలుగు సీజన్ 8 బుల్లితెరపై ఊహించని రీతిలో దూసుకుపోతోంది. షో నిర్వాహకులు మునుపటి షోల కంటే కూడా ప్రస్తుత ఎనిమిదవ సీజన్ విజయవంతంగా దూసుకుపోతుందని చెప్తున్నారు. ఈ షో చూడడం కోసం తెలుగు ప్రేక్షకులు సాయంత్రం కాకముందే టీవీల ముందు రాలిపోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా నేటి యువతలో 90 శాతానికి పైగా బిగ్ బాస్ షో తిలకిస్తున్నారని సర్వేలో తేలింది. దీని ప్రకారం చూసుకుంటే బిగ్ బాస్ షో టి ఆర్ పి రేటింగ్ గురించి కూడా ఒక అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతం నాలుగో వారం ఎపిసోడ్ పూర్తి కాబోతోంది. ఈ క్రbigg boss{#}Evening;SoniaGandhi;Bigboss;Avunu;Episode;House;Yevaru;Teluguబిగ్ బాస్ 8: ప్రమాదంలో పడ్డ స్ట్రాంగ్ కంటెస్టెంట్!బిగ్ బాస్ 8: ప్రమాదంలో పడ్డ స్ట్రాంగ్ కంటెస్టెంట్!bigg boss{#}Evening;SoniaGandhi;Bigboss;Avunu;Episode;House;Yevaru;TeluguFri, 27 Sep 2024 13:19:00 GMTబిగ్బాస్ తెలుగు సీజన్ 8 బుల్లితెరపై ఊహించని రీతిలో దూసుకుపోతోంది. షో నిర్వాహకులు మునుపటి షోల కంటే కూడా ప్రస్తుత ఎనిమిదవ సీజన్ విజయవంతంగా దూసుకుపోతుందని చెప్తున్నారు. ఈ షో చూడడం కోసం తెలుగు ప్రేక్షకులు సాయంత్రం కాకముందే టీవీల ముందు రాలిపోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా నేటి యువతలో 90 శాతానికి పైగా బిగ్ బాస్ షో తిలకిస్తున్నారని సర్వేలో తేలింది. దీని ప్రకారం చూసుకుంటే బిగ్ బాస్ షో టి ఆర్ పి రేటింగ్ గురించి కూడా ఒక అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతం నాలుగో వారం ఎపిసోడ్ పూర్తి కాబోతోంది. ఈ క్రమంలోనే ఎలిమినేషన్ల విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారని గుసగుసలు వినబడుతున్నాయి.

ఓటింగ్స్ అనాలసిస్ గమనిస్తే, అతనే లాస్ట్ పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. షో చూస్తున్న వాళ్లు కూడా అదే విషయం బయటకు చెబుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పెద్ద డిబేట్ నడుస్తోంది. అవును మీరు ఊహించింది నిజమే. మొదటినుండి హౌస్ లో బాగా ఆడుతున్న పృద్వి ఇప్పుడు ప్రమాదంలో పడినట్టు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అతను తర్వాత మణికంఠ కూడా కాస్త ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది.

పృద్వి, మణికంఠ ఇద్దరూ టాస్కుల విషయంలో తడబడుతున్నారు. వారి ఆట మీద వారికే స్పష్టత లేనట్టు కనబడుతోంది. ఇక వీరు తర్వాత కంటెస్టెంట్ సోనియా కూడా ప్రమాదంలో ఉన్నట్టు తేలిపోయింది. ఈవారం ఎండింగ్లో వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతారు? అనే విషయం పైన స్పష్టత రావచ్చు అని గుసగుసలు వినబడుతున్నాయి. నిఖిల్, పృద్వి పంచని చేరిన సోనియా మొత్తం మిగతా కంటెస్టెంట్లకు పడరాని వ్యక్తిగా తయారయింది. దాంతో హౌస్ మేట్స్ ఓట్స్ కూడా వీరికి లభించే అవకాశం ఉండదు! ఈ నేపథ్యంలోనే..... ఈ ముగ్గురిలో వచ్చేవారం ఎవరు బయటికి పోతారు అనే విషయం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్స్ జరుగుతున్నాయి. మీరు ఒకవేళ బిగ్ బాస్ షో వీక్షకులు అయితే మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్లలో తెలియ చేయండి. త్వరలో ఎవరు ఎలిమినేట్ కాబోతారు అనే విషయం తెలియ జెప్పండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>