MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/savitri-jamuna-comments-viral02897153-5838-46bb-99d6-59fe2dab0d0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/savitri-jamuna-comments-viral02897153-5838-46bb-99d6-59fe2dab0d0c-415x250-IndiaHerald.jpgతెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటినుంచే కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి, నాటక రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత నటిగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాత్రకు ప్రాణం పోయడం అంటే ఈమెకు మాత్రమే సాధ్యం అన్నంతగా ప్రతి పాత్రలో కూడా జీవించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా సావిత్రి తన సినీ కెరియర్లో చేయలేని పాత్ర ఉండదు అనడంలో అతిశయోక్తి కాదు. మహా మహుళ సినిమాలలో నటించి, తిరుగులేని తారగా ఒకSAVITRI;JAMUNA;COMMENTS;VIRAL{#}jamuna;savitri;SV museum;Mahanati;Savithri;Yevaru;Industry;krishna;Andhra Pradeshసావిత్రి మెడలో పూలహారం విలువ అన్ని రూ. లక్షలా.. విస్తుపోయే నిజాలు చెప్పిన జమున..!సావిత్రి మెడలో పూలహారం విలువ అన్ని రూ. లక్షలా.. విస్తుపోయే నిజాలు చెప్పిన జమున..!SAVITRI;JAMUNA;COMMENTS;VIRAL{#}jamuna;savitri;SV museum;Mahanati;Savithri;Yevaru;Industry;krishna;Andhra PradeshFri, 27 Sep 2024 18:33:00 GMTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటినుంచే కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి, నాటక రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత నటిగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాత్రకు ప్రాణం పోయడం అంటే ఈమెకు మాత్రమే సాధ్యం అన్నంతగా ప్రతి పాత్రలో కూడా జీవించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా సావిత్రి తన సినీ కెరియర్లో చేయలేని పాత్ర ఉండదు అనడంలో అతిశయోక్తి కాదు.

మహా మహుళ సినిమాలలో నటించి,  తిరుగులేని తారగా ఒక వెలుగు వెలిగింది. ఈమె నటన చూసి దిగ్గజ నటులు కూడా నివ్వెరపోయేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు,  కృష్ణ లాంటి మహానటులు కూడా ఆశ్చర్యపోయేలా నటించింది సావిత్రి. ఇక సావిత్రి క్రేజ్ ఎలా ఉందో ఒకసారి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది జమున. సాధారణంగా సావిత్రి దాన గుణం గురించి అందరికీ తెలుసు. ఎన్నో దానాలు కూడా చేసింది. అయితే ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్లో విపత్తు ఏర్పడినప్పుడు ఆ విపత్తు కోసం నిధిని సేకరించారు. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు ఉన్నారు. విపత్తు నిదికి సహాయం చేయాలని కోరినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించలేదట.


దీంతో పివి నరసింహారావు సావిత్రి మెడలో వేసిన పూలమాలను వేలం వేయగా.. దానిని కొనడానికి ఎగబడ్డ జనాలు చివరికి 30 వేల రూపాయలకు ఆ పూలదండను సొంతం చేసుకున్నారు. అప్పట్లోనే రూ.30 వేలు అంటే ఇప్పుడు దాని విలువ రూ.30 లక్షల కంటే ఎక్కువే. ఆ డబ్బులను సహాయ నిధికి ఉపయోగించారు అప్పటి ముఖ్యమంత్రి. దీన్నిబట్టి చూస్తే సావిత్రి క్రేజ్ ఆ సమయంలో ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా గతంలో జమున స్వయంగా చెప్పడం విశేషం. ఇకపోతే సావిత్రి  ప్రభుత్వానికి ఎన్నో విరాళాలు కూడా ఇచ్చారు. ఒకసారి విపత్తు వచ్చినప్పుడు. తన ఒంటిపై ఉన్న నగలు అన్ని దోచి ఇచ్చారు సావిత్రి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>