MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramgopal-varma877c99a1-9893-4591-b562-46549a686e97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramgopal-varma877c99a1-9893-4591-b562-46549a686e97-415x250-IndiaHerald.jpgవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు రామ్ గోపాల్ వర్మ టాలెంట్ ఏమిటో అందరికీ తెలిసిందే. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసించిన వర్మ, ఆనాటి నుండే సినిమాలు తీయాలని కలలుగని, చెన్నై చెక్కేసి అప్పటి తెలుగు సినిమా పరిశ్రమలోని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకులు అయినటువంటి, అక్కినేని నాగార్జున గారిని కలిసి, శివ అనే సినిమా కథను చెప్పి తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ, మొదటి పాన్ ఇండియా స్టార్ దర్శకుడRamgopal Varma{#}Rangeela;annapurna;Vijayawada;Ram Gopal Varma;Akkineni Nagarjuna;Chennai;ram pothineni;Tollywood;India;Darsakudu;lord siva;Shiva;Heroine;Director;bollywood;Cinema;Telugu;mediaరాంగోపాల్ వర్మ కోసం జీవితాన్నే త్యాగం చేసిన హీరోయిన్?రాంగోపాల్ వర్మ కోసం జీవితాన్నే త్యాగం చేసిన హీరోయిన్?Ramgopal Varma{#}Rangeela;annapurna;Vijayawada;Ram Gopal Varma;Akkineni Nagarjuna;Chennai;ram pothineni;Tollywood;India;Darsakudu;lord siva;Shiva;Heroine;Director;bollywood;Cinema;Telugu;mediaFri, 27 Sep 2024 12:00:00 GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు రామ్ గోపాల్ వర్మ టాలెంట్ ఏమిటో అందరికీ తెలిసిందే. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసించిన వర్మ, ఆనాటి నుండే సినిమాలు తీయాలని కలలుగని, చెన్నై చెక్కేసి అప్పటి తెలుగు సినిమా పరిశ్రమలోని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకులు అయినటువంటి, అక్కినేని నాగార్జున గారిని కలిసి, శివ అనే సినిమా కథను చెప్పి తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ, మొదటి పాన్ ఇండియా స్టార్ దర్శకుడు అయిపోయాడు. ఇక అక్కడినుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ సినిమా తర్వాత ఆయన ఏకంగా బాలీవుడ్ చెక్కేశాడు.

ఈ క్రమంలోనే రంగీలా, సత్య, సర్కార్ వంటి సినిమాలను ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి సంచలన విజయాలు నమోదు చేశాడు. ఇక అసలు విషయంలోకి వెళితే... రంగీలా సినిమాలోని ఊర్మిళ గురించి అందరికీ తెలిసిందే. రంగీలా సినిమా ద్వారా పరిచయమైన ఊర్మిళ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా అవతరించింది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె కూడా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కానీ రామ్ గోపాల్ వర్మ మీద ఉన్న అభిమానంతో ఆమె అప్పట్లో సదరు సినిమాలను తిరస్కరించేదట! ఈ క్రమంలోనే ఆమె వరుసగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. దాంతో మిగిలిన దర్శక నిర్మాతలు ఆమెపై తీవ్రమైన అసహనంతో ఉండేవారట. ఇక ఇదే విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మమీడియా వేదికగా చెప్పుకు రావడంతో విషయం వెలుగు చూసింది.

అప్పట్లో దాదాపు దశబ్ద కాలం పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చుట్టూనే హీరోయిన్ ఊర్మిళ జీవితం తిరిగేది. దాంతో అనేక రూమర్లు వీరి గురించి నడిచేవి. అయితే వారిద్దరి మధ్య ఉన్నది చాలా పవిత్రమైన సంబంధం అని ఆయన పలుమార్లు మీడియా వేదికలుగా చెప్పుకు రావడం అందరికీ తెలిసిన విషయమే. ఇక హీరోయిన్ ఊర్మిళ అందంతో పాటు అభినయం కలిగిన నటి. 17 సంవత్సరాల చిరుప్రాయంలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఊర్మిళ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>