MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala-siva04435133-4890-4f82-ab88-f7fb61901678-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala-siva04435133-4890-4f82-ab88-f7fb61901678-415x250-IndiaHerald.jpg జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన దేవర సినిమా... ఇవాళ ఉదయమే రిలీజ్ అయింది. దీంతో ఈ సినిమా కోసం ఎగబడి టికెట్లు సంపాదించుకున్న ఫ్యాన్స్... ఉదయాన్నే థియేటర్కు వెళ్లిపోయారు. ఇక రివ్యూల పైన రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇలాంటి తరుణంలోనే దేవరా సినిమా దర్శకుడు కొరటాల శివ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. ఆచార్య అట్టర్ ప్లాప్ చేసిన కొరటాల శివ.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు కూడా పెద్ద బొక్కే పెట్టాడని అంటున్నారు. koratala siva{#}Chiranjeevi;Jr NTR;NTR;koratala siva;Cinemaకోత‌ల రాయుడు కొర‌టాల.... ఇది నీకు బాగా సూట‌బుల్ సోద‌రా ?కోత‌ల రాయుడు కొర‌టాల.... ఇది నీకు బాగా సూట‌బుల్ సోద‌రా ?koratala siva{#}Chiranjeevi;Jr NTR;NTR;koratala siva;CinemaFri, 27 Sep 2024 08:13:00 GMTజూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన దేవర సినిమా... ఇవాళ ఉదయమే రిలీజ్ అయింది. దీంతో ఈ సినిమా కోసం ఎగబడి టికెట్లు సంపాదించుకున్న ఫ్యాన్స్... ఉదయాన్నే థియేటర్కు వెళ్లిపోయారు. ఇక రివ్యూల పైన రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.  ఇలాంటి తరుణంలోనే దేవరా సినిమా దర్శకుడు కొరటాల శివ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. ఆచార్య అట్టర్ ప్లాప్ చేసిన కొరటాల శివ.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు కూడా పెద్ద బొక్కే పెట్టాడని అంటున్నారు.

 రెండు గంటల 50 నిమిషాల పాటు సోది తప్ప కథ మాత్రం ఎక్కడ కనిపించలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కేవలం 30 నిమిషాలు మాత్రమే కొరటాల దర్శకత్వానికి మార్కులు వేయవచ్చని అంటున్నారు. ఆరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యేలా కొరటాల శివ దర్శకత్వం కనిపించిందని కొంతమంది... అభిప్రాయపడుతున్నారు. కొరటాల శివ.. కోతలు కోయడం తప్ప సినిమా మాత్రం తీయరాదని.. మండిపడుతున్నారు.

 ఈ సినిమా రిలీజ్ కాకముందు చాలా ఇంటర్వ్యూలలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పరోక్షంగా చాలా వ్యాఖ్యలు చేశారు కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి కారణంగానే ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పగానే చెప్పారు. తన దర్శకత్వాన్ని మెగాస్టార్ చేశారని కూడా.. కొరటాల శివ చాలా సందర్భాలలో పరోక్షంగా  వెల్లడించారు. ఇక ఈ దేవర సినిమా సందర్భంగా కూడా... ఎవరి పని వారు చేసుకోవాలి... ఇంకొకరి పనిలో వేలు పెట్టకూడదని చిరంజీవిని ఉద్దేశించి సెటైర్లు పేల్చారు కొరటాల శివ.

 ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవి కూడా గొంతులో నుంచి రావు. నాలుక పైన ఉన్న మాటలను ఎడాపెడా వాగేస్తూ ఉంటారు కొరటాల శివ.  దీంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. ఇక ఇప్పుడు దేవర సినిమాలో.. కొరటాల శివ ఫ్లాప్ అయ్యాడని కొంతమంది చెబుతున్నారు. ఆచార్య చిరంజీవి వల్ల ఫ్లాప్ అయింది అని చెప్పిన కొరటాల శివ.... ఇప్పుడు దేవరాను నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>