Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/ntrdevarae8d05ec3-2264-428d-a056-0e8e8bd72811-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/ntrdevarae8d05ec3-2264-428d-a056-0e8e8bd72811-415x250-IndiaHerald.jpgఅభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. ఎన్టీఆర్ సోలో హీరోగా బాక్సాఫీస్ 'దేవర' అవుతానంటూ మన ముందుకు వచ్చేసాడు. ఈ నేపధ్యంలో అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపులకు దేవర సమాధానం చెప్పారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కొరటాల శివ దర్శకత్వం వహించిన `దేవర`లో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. సైఫ్‌ అలీ ఖాన్‌, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. నేడు శుక్రవారం ,సెప్టెంబర్‌ 27న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దేవntrdevara{#}Friday;mikkilineni;ali;koratala siva;Cinema;NTRదేవ‌ర : తార‌క్ ఆచార్య రిజ‌ల్ట్ చూసి అయినా దండం పెట్టి ఉండాల్సింది క‌దా..!దేవ‌ర : తార‌క్ ఆచార్య రిజ‌ల్ట్ చూసి అయినా దండం పెట్టి ఉండాల్సింది క‌దా..!ntrdevara{#}Friday;mikkilineni;ali;koratala siva;Cinema;NTRFri, 27 Sep 2024 10:00:00 GMTఅభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. ఎన్టీఆర్ సోలో హీరోగా బాక్సాఫీస్ 'దేవర' అవుతానంటూ మన ముందుకు వచ్చేసాడు. ఈ నేపధ్యంలో అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపులకు దేవర సమాధానం చెప్పారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కొరటాల శివ దర్శకత్వం వహించిన `దేవర`లో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. సైఫ్‌ అలీ ఖాన్‌, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. నేడు శుక్రవారం ,సెప్టెంబర్‌ 27న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దేవర పాత్రను , అతని సమస్యను పరిచయం చేయటానికే దాదాపు ఫస్టాఫ్ వాడుకున్నారు. ఎంగేజింగ్ గా యాక్షన్ సీన్స్ తో వెళ్లిపోవటంతో సమస్య రాలేదు కానీ లేకపోతే ఇబ్బంది అయ్యిపోయేది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ దాకా సినిమా నెక్ట్స్ లెవిల్ అనిపిస్తుంది. అందుకే ఇంటర్వెల్ చూసి బయిటకు వెళ్లి వచ్చిన ప్రేక్షకుడు అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తే రెండో ఎన్టీఆర్ వర పాత్రతో సెకండాఫ్ ప్రారంభమై ,లవ్ స్టోరీతో నడుస్తూ స్పీడు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది.జాన్వి కపూర్ పాత్ర ను, ఆమెను ప్రెజెంట్ చేసిన విధానం కాస్త వెనక రోజులకు వెళ్లినట్లు అనిపించినా సాంగ్స్ బాగుండటం కలిసొచ్చింది. ఫస్టాప్ ఉన్నట్లు సెకండాఫ్ లేకపోవడంతో ఆడియెన్స్ లో నిరాశ కలుగుతుంది. కథ పరంగానూ ఎంచుకున్న నేపథ్యం వేరుగానీ, స్క్రీన్‌ ప్లే పరంగా రొటీన్‌గానే ఉంటుంది. ముందుగా ఊహించినట్టుగానే సీన్లు ఉండటం పెద్ద మైనస్‌. దేవరని చంపేసేందుకు భైర చేసే ప్లాన్‌ అవన్నీ రొటీన్‌గానే ఉంటుంది. దాన్ని నడిపించిన తీరులో కూడా కొత్తదనం లేదు.

`ఆచార్య`లో పాదగట్టం, `దేవర`లో ఎర్రసముద్రం అంతే తేడా అనేలా ఉంది. కొరటాల గత చిత్రాల మార్క్ చూపించలేకపోయాడు. హీరోయిజానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే క్రమంలో అసలు కథ పలుచనైపోయింది. పైగా ఊహించేలా స్క్రీన్‌ ప్లే ఉండటం పెద్ద మైనస్‌. బాహుబలిని గుర్తు చేసేలా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కు లీడ్ వదిలిన విధానం బాగుంది. కానీ అందులోనే హింట్‌ ఇచ్చాడు. ఇప్పటికే బయట జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలా ట్విస్ట్ ఉండటంతో అసలు లీక్‌ని దర్శకుడే ఇచ్చాడనే ఫీలింగ్‌ కలుగుతుంది. దీంతో క్లైమాక్స్ ట్విస్ట్ కూడా తేలిపోయిందనే చెప్పాలి.ఈ నేపథ్యంలో ఆచార్య డిజాస్టర్ చూసిన తర్వాత అయినా ఎన్టీఆర్ కొరటాల శివను ఎంచుకోకపోయివుంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.అలాగే కొరటాల డిజైన్ చేసిన సీన్స్ అనిరుథ్‌ ఎలివేట్‌ చేశాడు. కానీ కథలో బలం లేకపోవడం వల్ల ఏం చేసినా అది చప్పగానే మారిపోయింది. పాటల్లో ఇప్పటికే రెండు సూపర్ హిట్స్. కొరటాల డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పదేముంది. మిగతా క్రాప్ట్ కూడా సినిమాకు బాగా కలిసొచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టెక్నికల్‌గా సినిమా బాగుంది. కానీ దానికి కథ, స్క్రీన్‌ ప్లే కూడా బలంగా ఉంటే సినిమా బాగుండేది. కానీ కొరటాల తన మార్క్ ని మిస్‌ అయ్యాడు.దేవర...ఎన్టీఆర్ సినిమాగా ఓ మెట్టు పైనే ఉంది. అయితే ఎన్టీఆర్ ని ప్రక్కన పెట్టి చూస్తే కథలో పెద్దగా ట్విస్ట్ లు కనిపించవు, కొన్ని చోట్ల పాత సీన్స్ తో , రొటీన్ గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ అయితే మరీను.. అయితే ఓవరాల్ గా చూస్తే ఫర్వాలేదు. కానీ ఎన్టీఆర్‌ రేంజ్‌ మూవీ అనిపించుకోదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>