MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/devera4e31d646-67eb-4bf5-971b-da323f7ff127-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/devera4e31d646-67eb-4bf5-971b-da323f7ff127-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన సినిమా దేవర తాజాగా రిలీజ్ అయి, పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్, నటన అదిరిపోయాయని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో ఉన్నాయని చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాలలో మాదిరిగానే, ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ తనదైన శైలిలో డ్యాన్స్ ఇరగదీసేశారు అని ఫ్యాన్స్ గొప్పలు పోతున్నారు. devera{#}kushi;Kushi;NTR Arts;kalyan ram;media;Jr NTR;koratala siva;NTR;Cinema;Newsఆ ట్విస్ట్ ని తట్టుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్?ఆ ట్విస్ట్ ని తట్టుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్?devera{#}kushi;Kushi;NTR Arts;kalyan ram;media;Jr NTR;koratala siva;NTR;Cinema;NewsFri, 27 Sep 2024 13:59:23 GMTజూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన సినిమా దేవర తాజాగా రిలీజ్ అయి, పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్, నటన అదిరిపోయాయని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో ఉన్నాయని చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాలలో మాదిరిగానే, ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ తనదైన శైలిలో డ్యాన్స్ ఇరగదీసేశారు అని ఫ్యాన్స్ గొప్పలు పోతున్నారు.

ఇక దేవర సినిమా ఆద్యంతం అలరించినప్పటికీ, సినిమా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ కి ఫ్యాన్స్ కి మతి పోయిందట! అటువంటి ట్విస్ట్ మా జూనియర్ మునిపెన్నడు ఇవ్వలేదని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లపుచ్చుతున్నారు. దాంతో సహజంగానే అభిమానులకి సెకండ్ పార్ట్ పైన నమ్మకాలు రెట్టింపు అయినాయి అని తెలుస్తోంది. అయితే ఆ ట్విస్ట్ విషయంలో మరి కొంతమంది ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినట్టు అర్థం అవుతుంది.

ఇక విషయం ఏమిటంటే దేవర సినిమా రెండు పార్టీలుగా రాబోతున్న కారణంగా.... సినిమా అర్ధాంతరంగా ముగిసిపోతున్న ఫీల్ కలిగిందని అంటున్నారు. రెండు మూడు పార్టీలు తీస్తున్నప్పుడు ఇలాంటి సమస్య రావడం మామూలే అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన కళ్యాణ్ రామ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈరోజే రిలీజ్ అయిన దేవర సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా దేవర సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా స్పందన చూసి ఖుషి గా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి థాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టడం జరిగింది!






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>