LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/habits--suger-diabetes-sugar-problem-health8dbfcbd6-6d1a-484d-af92-799cca21641d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/habits--suger-diabetes-sugar-problem-health8dbfcbd6-6d1a-484d-af92-799cca21641d-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా షుగర్ వ్యాధి అందరికీ ప్రారంభిస్తుంది. చిన్నవారికి కూడా ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తీపి ఎక్కువగా తినటం వల్ల షుగర్ వస్తుంది అని అంటారు. మనం తినే ఆహారాన్ని బట్టే షుగర్ అనేది వస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. షుగర్ వ్యాధికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు ఇవి! సోడా, సాప్ట్ డ్రింక్స్ వంటి కూల్ డ్రింక్స్ లో చక్కెర, సోడియం లెవెల్స్ అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. చాలామంది బరువు తగ్గhabits ; suger; diabetes; sugar problem; health{#}Carbohydrates;Sugar;Butter;Sodium;Ee Rojullo;vegetable market;Manamషుగర్ వ్యాధికి దారి తీసే ఆహారపు అలవాట్లు ఇదే ‌..!షుగర్ వ్యాధికి దారి తీసే ఆహారపు అలవాట్లు ఇదే ‌..!habits ; suger; diabetes; sugar problem; health{#}Carbohydrates;Sugar;Butter;Sodium;Ee Rojullo;vegetable market;ManamThu, 26 Sep 2024 17:25:00 GMTఈరోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా షుగర్ వ్యాధి అందరికీ ప్రారంభిస్తుంది. చిన్నవారికి కూడా ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తీపి ఎక్కువగా తినటం వల్ల షుగర్ వస్తుంది అని అంటారు. మనం తినే ఆహారాన్ని బట్టే షుగర్ అనేది వస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. షుగర్ వ్యాధికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు ఇవి! సోడా, సాప్ట్ డ్రింక్స్ వంటి కూల్ డ్రింక్స్ లో చక్కెర, సోడియం లెవెల్స్ అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. చాలామంది బరువు తగ్గటం కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉంటుంటారు. కానీ ఇది అసలు మంచిది కాదు.

దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి భవిష్యత్ లో డయాబెటిస్కు దారితీస్తుంది. డయాబెటిస్ రాకుండా చూసుకోవాలంటే మీ డైట్ లో తాజా పండ్లు, కూరగాయలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిని తినకపోవడం వల్ల షుగర్ వ్యాధి రిస్క్ ఎక్కువవుతుంది. ఈరోజుల్లో చాలామంది జంక్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. పిజ్జా, బర్గర్, నూడిల్స్ వంటివి ఎక్కువగా తింటున్నారు. అయితే వీటిలోని సమ్మేళనాల రక్తంలో షుగర్ పెరగడానికి కారణం అవుతాయి. బట్టర్ నాన్, బటర్ బేక్, బటర్ కూరలు తినటం కూడా మంచిది కాదు. బటర్ తో చేసినవి ఎక్కువ తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా గల పాస్తా, బంగాళదుంప, వైట్ బ్రెడ్ తినటం మంచిది కాదు. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం అవుతాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవాలి. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా షుగర్ వ్యాధికి కారణం అవుతుంది. అందుకే ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించుకోవటం కోసం యోగా, మెడిటేషన్ వంటివి చేయటం చాలా మంచిది. మన ఆరోగ్యం బాగుండాలంటే రోజు తప్పనిసరి వ్యాయామం చేయాల్సిందే. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు ఎక్సెర్ సైజ్ కోసం కేటాయించాలి. వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ వంటివి చేసిన పర్లేదు. దీనివల్ల రక్తంలో షుగర్ అదుపులో ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది డిన్నర్ ఆలస్యంగా చేస్తున్నారు. కానీ ఆలస్యంగా తినటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పడుకోవడానికి రెండు గంటల ముందు డిన్నర్ ముగించటం ఉత్తమం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>